విండీస్ విజయం


Thu,November 7, 2019 03:03 AM

లక్నో: రోస్టన్ చేజ్ (94; 11 ఫోర్లు), షై హోప్ (77 నాటౌట్; 5 ఫోర్లు) భారీ అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో మొదట ఆఫ్ఘనిస్థాన్ 45.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (61), ఇక్రామ్ (58) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం సునాయాస లక్ష్యఛేదనలో ఆఫ్ఘాన్ స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కరీబియన్లు ఆడుతూ పాడుతూ 46.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగనుంది.

325

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles