ప్రణాళికతో ముందుకొస్తే నిషేధం ఎత్తేస్తాం


Sun,August 11, 2019 01:37 AM

-భారత ఆర్చరీ సంఘానికి డబ్ల్యూఏ లేఖ

న్యూఢిల్లీ: సమాంతర పాలక మండళ్లను రద్దు చేసుకొని పక్కా ప్రణాళికతో ముందుకొస్తే.. ఈ నెలాఖరులోగా భారత ఆర్చరీ సంఘంపై విధించిన నిషేధం ఎత్తివేసే అవకాశాలున్నాయని ప్రపంచ ఆర్చరీ (డబ్ల్యూఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు డబ్ల్యూఏ కార్యదర్శి టామ్ డైలెన్ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్ మెహతాకు శనివారం లేఖ రాశారు. ఈ ఏడాది జూన్‌లో నిబంధనలకు విరుద్ధంగా భారత ఆర్చరీ సంఘం ఢిల్లీ, చండీగఢ్ కేంద్రాలుగా రెండు ఎన్నికలను నిర్వహించింది. అందులో అర్జున్ ముండా, బీవీ పాపారావు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. దీనిపై ఆగ్రహించిన డబ్ల్యూఏ జూలై ఆఖరు వరకు తుది గడువు ఇచ్చి సమస్య పరిష్కరించుకోమని ఆదేశించింది. ఇరు వర్గాల నుంచి ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసింది. ఈ అంశంపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్ జస్టిస్ బీడీ అహ్మద్ నేతృత్వం వహించనున్నారు.

281

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles