భారత్‌కు నాలుగో స్థానం


Fri,March 15, 2019 12:33 AM

-వరల్డ్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్
అస్తానా (కజకిస్థాన్): భారీ ఆశలు పెట్టుకున్న భారత పురుషుల జట్టు.. వరల్డ్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో నిరాశపర్చింది. గురువారం జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్ 1.5-2.5తో రష్యా చేతిలో ఓడింది. దీంతో 11 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిం ది. 8వ రౌండ్ వరకు రెండో స్థానంలో ఉన్న భారత్ ఆఖరి రౌండ్‌లో గెలిస్తే రజతం దక్కేది. ఒకవేళ డ్రా చేసుకున్నా కనీసం కాంస్యమైనా లభించేది. కానీ దురదృష్టవశాత్తు ఓటమితో ఏ పతకం దక్కలేదు. నాలుగో బోర్డులో అరవింద్ చిదంబరం.. దిమిత్రి ఆండ్రికెన్‌పై గెలిచే అద్భుత అవకాశాన్ని చేజార్చుకుని డ్రాతో సంతృప్తిపడ్డాడు. రెండో బోర్డులో సూర్యశేఖర గంగూలీ కూడా నెపోమించెట్చితో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఈ రెండు ఫలితాలతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సెర్గి క్రాజాకిన్‌తో గేమ్‌ను అధిబన్ డ్రా చేసుకోగా, అలెగ్జాండ్ గ్రిస్చుక్ చేతిలో ఎస్పీ సేత్‌రామన్ ఓడిపోయాడు. భారత మహిళల టీమ్ 9 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. హంగేరితో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకున్నది. ఇషా కర్వాడే, పద్మిని రౌత్.. తమ గేమ్‌లను డ్రా చేసుకోగా, భక్తీ కులకర్ణి విజయం సాధించింది. మరో గేమ్‌లో సౌమ్య స్వామినాథన్ ఓటమిపాలైంది.

204

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles