వాస్తు


Sun,September 15, 2019 01:37 AM

vasthu

అక్కా తమ్ముడు ఒకే స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా? ఎవరు ఎటువైపు ఉండాలి?

- బి.పద్మ, ఎల్‌బి నగర్‌
అనుబంధాలను శాస్త్రం విడదీయదు.. మనుషులే వేరై శాస్ర్తాలను విభజించే వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. సంస్కారవంతమైన వ్యక్తులు ఎక్కడ ఉన్నా పరస్పర అవగాహనతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు, గొడవలు పడకుండా. మీరు ఎంచుకున్న స్థలం శక్తివంతమైతే అందులో అక్కభాగాన్ని దక్షిణం వైపు ఏర్పాటు చేయండి. తమ్ముడు కాబట్టి బావ గారికే ఉచ్ఛస్థానం కల్పించాలి. తర్వాత ఉత్తర భాగం తమ్ముడు తీసుకొని ఇంండ్లు కట్టుకోవాలి. అయితే ఎవరు ఎంత అనుబంధంతో ఉన్నా ఎవరి కాంపౌండ్స్‌ వారు సమపట్టుతో నిర్మించుకోవాలి. ఎవరి గేటు వారు, ఎవరి మెట్లు వాళ్లు ఎవరి సెప్టిక్‌ట్యాంక్‌ వారు సెపరేటుగా కట్టుకోవాలి. ఇంటి విభజనలో శాస్త్ర నిబద్ధత తప్పనిసరి చేయాలి.

మాకు ఉన్న స్థలానికి దక్షిణంలో పెద్ద బావి ఉంది. మేము ఆ స్థలంలో ఇల్లు కట్టొచ్చా?

- వి.నరేంద్ర, జీడికల్‌
మనం స్థలం ఎంచుకునేటప్పుడే దాని పరిసరాలు వాటి స్థితిగతులు చూడాలి. వాటి ఉత్తరోత్తర పరిణామాలు అంచనా వేయాలి. మీ స్థలానికి దక్షిణంలో పెద్ద బావి ఉంది. అంటే అది పాత బావి అయి ఉంటుంది. దానిని వినియోగిస్తున్నారా. కూడ్పేస్తున్నారా? అన్నది వివరించలేదు. అది ఏ రోడ్డు కలిగి ఉందో చెప్పలేదు. ఒకవేళ దానిని కూడ్పితే మీ స్థలం లో మీరు ప్రహరీలు ముందు కట్టి మీ ఇల్లు మీరు కట్టుకోండి. ఆ దక్షిణం బావి ఇప్పటికీ వాడుతూ ఉంటే అది రేపు అలాగే ఉంటుంది కాబట్టి మీ స్థలంలో ఇల్లు కట్టుకోవద్దు. నిర్జీవమై పోయి ఉంటే ఫరవాలేదు. అలాగే ఆ బావి ఉన్న స్థలంలో ఏదైనా నిర్మాణం దానికి దక్షిణం, పడమరలో ఉంటే బావిని పూడ్చుతూ ఉంటే మనకు దోషం ఉండదు. ఏదేమైనా అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

లే అవుట్‌ స్థలానికి ఈశాన్యం తెగిపోయింది. దాంట్లో విల్లా (ఇల్లు) కొనవచ్చా?

- ఎన్‌.వి.శైలేష్‌కుమార్‌, లింగంపల్లి
లే అవుట్‌ సరిహద్దులు సక్రమంగా మెట్నకు సరిచేసి ఎవరూ ఇండ్ల స్థలాలను విభజించరు. తద్వారా వాళ్లకు కావలసిన పార్కులు, ఇతరత్రా ఖాళీ ప్రదేశాలు రావు. ఊర్లు కూడా వాటి సరిహద్దులు సక్రమంగా ఉంటాయన్నది అసాధ్యం. కారణం అది మనం రూపొందించినవి అయి ఉండవు. వాటి నిర్మాతలు ఉండరు. వాటికవిగా ఏర్పడి ఉంటాయి కాబట్టి. అయితే కొందరు కొత్తగా నిర్మించే వాటిని వాటి సరిహద్దులు సరిచేసుకుని నిర్మిస్తే అది గొప్ప కార్యమే అవుతుంది. కానీ అది అందరూ చేయాలని, చేస్తేనే ఆ లే అవుట్‌లో ఇల్లు కొనాలనే నియమం లేదు. ప్రధానంగా మనం కొనే ఇంటికి కాంపౌండ్‌ దిశకు, మెట్నకు తప్పనిసరిగా ఉండాలన్నది నియమిత అంశం. అందరూ పాటించాల్సిన విషయం. మీరుకొనే విల్లా సరైన దిశలో శాస్త్రపరంగా ఉంటే కొనుక్కోండి. దాంట్లో దోషాలు ఉంటే సరిచేసుకోండి.

బురుజు గోడ ఎదురుగా ఇల్లు ఉండొచ్చా? ఒకవేళ ఉంటే ఎటువంటి దోషాలు కలుగుతాయి?

- నీలకంఠ లక్ష్మి, కొత్తపేట
ఎత్తు ప్రదేశాలు మన ముఖాన్ని చాటుచేసేలా ఉండవద్దు. ఇంటికి ముఖం తూర్పు, ఉత్తరం, ఈశాన్యం. ఈ దిశలు మన గృహం ఉద్ధతిని నిలబెడుతాయి అవి ఎత్తయినప్పుడు. ప్రధానంగా ఇంటి ఆరోగ్యం విషయంలో నష్టాలు కలుగుతాయి. మీ గృహం తూర్పు ముఖం అయ్యి అటువైపు పెద్ద కోట గోడలా బురుజు ఉంటే ఆ ఎత్తు మీ ఇంటి హద్దు అయినప్పుడు తప్పక దోషం ఉంటుంది. లేదు పడమర వైపు ఆ బురుజు ఉంటే ఇబ్బంది ఉండదు. అలాగే దక్షిణం వైపు ఉన్నా దోషం లేదు. మీ గృహం చుట్టూ ప్రహరీలు ఉండి తూర్పులో మీ గృహానికి బురుజు గోడకు మధ్య వీధి ఉంటే అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆ గృహంలో అలాగే నివాసం ఉండవచ్చు. తూర్పు వీధి లేకున్నా.. అటువైపు విశాలమైన స్థలం ఉండి మన ఇంటి చుట్టూ కాంపౌండు ఉన్నా దోషం ఉండదు. ఎటొచ్చి ఒంటరి ఇల్లు ఉండి తూర్పు - ఉత్తరాలలో ఇంటిని అంటుకొని బురుజు ఉంటే మాత్రం పురుషులు యోగించరు. ఇల్లు మారాల్సి ఉంటుంది.
vasthu1
సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

246
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles