నెట్టిల్లు


Sun,October 20, 2019 01:26 AM

కథను కేవలం ఆనందం కోసం కాకుండా సామాజిక బాధ్యతను పెంచేందుకు రాసి, లఘుచిత్రం నిర్మిస్తే ఎలా ఉంటుందో .. యువతరం లఘుచిత్ర దర్శకులు నిరూపిస్తున్నారు. ఇటీవల యూట్యూబ్‌లో వచ్చిన కొన్ని లఘుచిత్రాలు ఇదే కథాంశంతో వచ్చాయి. వాటి సమీక్షలే ఇవి.

సుమనోహరం


దర్శకత్వం: కె.వెంకటశివకుమార్
నటీనటులు : శివ, చాందిని
ఇద్దరి మధ్య పెండ్లిచూపుల స్టోరీలైన్‌తో కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం ఈ లఘుచిత్రంలో కనిపిస్తుంది. కథ విషయానికి వస్తే.. ప్రణవ్, ప్రియా పెండ్లిచూపుల కోసమని ఓ కాఫీషాప్‌లో కలుసుకుంటారు. ఇద్దరి గురించి మాట్లాడుకుంటారు. అభిరుచులు, ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ప్రేమ గురించి అభిప్రాయాలు పంచుకుంటారు. ఇలా సాగుతున్న క్రమంలో ప్రియాకు ప్రణవ్‌ఓ కథ
చెప్తాడు. అదంతా విన్న తర్వాత కథలో ప్రేమికులు వీళ్లే అని తెలుస్తుంది. వీళ్లది నిజమైన ప్రేమ కాబట్టి మళ్లీ కలిశారు అనేది అర్థం అవుతుంది. అప్పుడు ప్రణవ్ ప్రియాకు ప్రేమను ప్రపోజ్ చేస్తాడు. అప్పుడే ఒప్పుకుంటే ఎలా? నెల రోజులు వెంటపడు, ఇంప్రెస్ చేయి అని ప్రియా అంటుంది. దానికి సరే అంటాడు. మరోవైపు నిజమైన ప్రేమికుల కోసం ఎదురు చూస్తున్న రెండు చిలకలకు ప్రణవ్, ప్రియా కనబడతారు. ఎన్నేండ్ల కాలంలో చూసిన నిజమైన ప్రేమ జంట ఇదే అనుకుంటాయి ఆ చిలుకలు. మరి ఆ చిలుకలు ఏంటి? ఎందుకు అక్కడి వచ్చాయి? ప్రణవ్, ప్రియాల పెండ్లి చూపులు

ఏమయ్యాయి? పూర్తిగా అర్థం కావాలంటే యూట్యూబ్‌కు వెళ్లండి.
Total views
124,543+(అక్టోబర్ 12 నాటికి)
published on Oct 5, 2019


దర్శకత్వం: ప్రదీప్
నటీనటులు : మహేశ్, సతీశ్, మహేశ్వరి
అర్ధరాత్రి పూట ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. కానీ ఆ హత్యకు సంబంధించిన నేరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కొందరు యువకుల మీదకు వస్తుంది. రాత్రిపూట ఐటీ ఏరియాలో ఈ మర్డర్ కావడం, వీరి గుర్తింపు కార్డులు హత్య జరిగిన ప్రాంతంలో దొరకడం కారణంగా పోలీసులు వీరిని పట్టుకుంటారు.కానీ పోలీసుల నుంచి వారు తప్పించుకుంటారు. మద్యం మత్తులో రాత్రి పూట క్యాబ్‌లో వచ్చినట్టు ఆ యువకులు గుర్తుంటుంది. కానీ మర్డర్ విషయం వాళ్లకు అంతగా తెలియదు. కాబట్టి ఆ హత్య చేసిందెవరనేది నిర్ధారించుకొనేందుకు వాళ్లు శోధిస్తారు. రాత్రి ప్రయాణించిన కారు వివరాల ఆధారంగా డ్రైవర్‌ను పట్టుకుంటారు. హత్యకు అతనికి సంబంధం లేదంటాడు. హత్య ఆరోపణ ఈ యువకులను వెంటాడుతుంది. మళ్లీ క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకొని గట్టిగా అడుగుతారు. అప్పుడు డ్రైవర్ అంతా చెపుతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? డ్రైవర్‌కు సంబంధం ఏంటి? తెలియాలంటే పూర్తి లఘుచిత్రం యూట్యూబ్‌లో చూడండి.

Total views
7,334+(అక్టోబర్ 12 నాటికి)
Published on Oct 8, 2019


వీకెండ్ గాంధీ

దర్శకత్వం: బ్రహ్మేశ్వర్
నటీనటులు : నితిశ్ చంద్ర, రసజ్ఞ రీతువారం మొత్తం ఉద్యోగం చేసిన చాలామంది వారాంతపు రోజులను ఆనందించాలనుకుంటారు. కానీ ఈ లఘుచిత్రంలో హీరో మాత్రం సెలవు రోజులను వృథా చేయకుండా సామాజిక బాధ్యత కోసం ఉపయోగిస్తాడు. వారం మొత్తం ఆఫీస్‌లో పని చేసిన అతను శని, ఆదివారాల్లో తనకు ఇష్టమైన పని చేస్తాడు. అది సొసైటీకి మేలు చేస్తే చాలు అనుకుంటాడు. ఈ క్రమంలోనే అతన్ని ఓ అమ్మాయి చూస్తుంది. వారం వారం ఇతను చేస్తున్న పనిమీద ఆమెకు ఆసక్తి కలుగుతుంది. అతని గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇలా ఓ రోజు అతనితో మాట్లాడి ఎందుకు ఇలా చేస్తున్నారో కనుక్కుంటుంది. అతను చెప్పిన విషయాలపట్ల నిజాయితిని చూసి ఆమె కూడా అతనితో కలిసి అచ్చం అతనిలాగే చేయాలనుకుంటుంది. దానికి అనుమతి కోరుతుంది. ఇంతకీ వారిద్దరూ చేస్తున్న పని ఏంటి? ఎందుకు అతను వీకెండ్‌లో ఇలా చేస్తున్నాడో తెలియాలంటే ఈ లఘుచిత్రం చూడాల్సిందే. మంచి సందేశాత్మక లఘుచిత్రం చూసినట్టు భావిస్తారు. లఘుచిత్ర నిర్మాణం, నటన

ఆకట్టుకుంటాయి.
Total views38,673+(అక్టోబర్ 12 నాటికి)
Published on Oct 4, 2019


ముందుచూపు

దర్శకత్వం: వరం
నటీనటులు : బాలు, శ్రీనివాస్, లక్ష్మి
చదువు: నేర్చుకోవడమే కాదు దానితో పాటు సంస్కారాన్ని కూడా అలవర్చుకోవాలి.. అలాంటప్పడే ఉన్నతమైన భవిష్యత్ సాధ్యం అవుతుందని చెప్పే లఘు చిత్రం ముందుచూపు. కథ

విషయానికి వస్తే బాలాజీ పాఠశాల విద్యార్థి. ఓ రోజు పరుగు పందెంలో నెగ్గిన బాలాజీకి ఉపాధ్యాయులు బహుమతిగా ఓ మొక్కను ఇస్తారు. సంరక్షించాలనీ చెప్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ చెట్టును మాత్రం నిర్లక్ష్యం చేయడు. ఉపాధ్యాయులు చెప్పినట్టు పాటిస్తాడు. ఓ క్రమంలో అదే అతని స్నేహితునిగా భావిస్తాడు. ఇలా 20 ఏండ్ల తర్వాత ఓ పెద్దాయ పెరిగిన ఆ చెట్టుకింద కూర్చొని సేద తీరతాడు. ఎవరు నాటారో అని తల్చుకుంటాడు. అదే సమయంలో ఆ చెట్టు దగ్గరకు వచ్చిన ఓ కలెక్టర్ ఆ పెద్దాయనను గుర్తుపట్టి పలకరిస్తాడు. ఆ చెట్టు గురించి మాట్లాడుకుంటారు. చెట్టు నాటడానికి కారణం మీరే అని ఆ పెద్దాయనతో అంటాడు కలెక్టర్. పాఠశాలలో మీరు నాకు ఇచ్చిన చెట్టే ఇది అని, మీరు చెప్పిన పాఠాలు నేర్చుకొనే కలెక్టరయ్యాను అని అంటాడతను. చదువుతో
పాటు సంస్కారం, విలువలు పాటిస్తే విజయం సాధించవచ్చని ఆ పెద్దాయన మల్లొక్కసారి గుర్తుచేస్తాడు.
Total views1,270+(అక్టోబర్ 12 నాటికి)
Published on Oct 12, 2019
వినోద్ మామిడాల, సెల్: 7660066469

746
Tags

More News

VIRAL NEWS