వాస్తు


Sun,October 27, 2019 12:50 AM

ఊరి సరిహద్దుల్లో మార్పులు వస్తే వాస్తులో తేడాలు వస్తాయా? ఆ ప్రభావం ఊరిపై ఉంటుందా?-రామచంద్రమూర్తి, ములుగు

పరిసర వాస్తు ప్రభావం తప్పక ఉంటుంది. సహజంగా ఒక నగరం, పట్టణం గ్రామ సరిహద్దులు పెద్దగా మార్పులు చెందవు. పెద్దపెద్ద మెట్రోపాలిటన్ నగరాలలో వచ్చిన భారీ మార్పులు పల్లె ప్రాంతాల్లో ఉండవు. మహా నగరాలలో రింగ్‌రోడ్లు, మెట్రో కారిడార్స్, షాపింగ్ మాల్స్ పెద్దపెద్ద కంపెనీలు వస్తుంటాయి. వాటికి తగిన రీతిలో పెద్ద ఎత్తున రహదారులు వచ్చినప్పుడు ఆయా పరిసర కాలనీల మీద వాటి ప్రభావం పడుతుంది. అది మైనస్ కావచ్చు ప్లస్ కావచ్చు. దేనినైనా భరించాల్సిందే. పల్లెటూర్లలో ప్రభుత్వ మార్కెట్ నిర్మాణాలు జరిగినప్పుడు కూడా ఆ పల్లె వాస్తులో తప్పక ప్రభావాలు ఏర్పడతాయి. అప్పుడు వాటికి తగిన మార్గాలు అనురించాల్సి వస్తుంది.

సింహద్వారం ఎత్తుచేసి మిగతా ఇంట్లోని ద్వారాలు చిన్నగా పెట్టుకోవచ్చా?-ఎక్కల నరసింహ, రాయిగిరి

ద్వారాలు గృహానికి బిగించే విషయంలో ఎత్తు ఎప్పుడూ ఒకే కొలతకి అన్నీ చేయాల్సి ఉంటుంది. ఇంట్లోకి ప్రధాన రాకపోకలు సింహద్వారాల గుండా జరుగుతుంటాయి. కాబట్టి అవి ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయి. కేవలం వాటిని మాత్రం ఎత్తు చేసి మిగతా వాటిని తక్కువ ఎత్తుగా బిగించడం మంచిదికాదు. ద్వారాల నిర్మాణంలో వెడల్పు విషయంలో వెసులుబాటు ఉంది. ఎత్తులో మాత్రం ఉండవద్దు. ద్వారాలు ఎన్ని అవసరమో తగు రీతిలో నిర్ణయించి వాటిని నిర్మించుకోవాలి. టాయిలెట్ ద్వారాలు కేవలం రెండున్నర అడుగుల వెడల్పులో ఉంటాయి. వాటిని కూడా సింహద్వారం ఎత్తులోనే ఉండేలా తయారు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ద్వారం ఫ్రేముల విషయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ప్రధానద్వారం ఫ్రేము చాలా పెద్దగా ఎంతో గంభీరంగా, అందంగా నిర్మిస్తుంటారు. అలాగని టాయిలెట్ ద్వారం కూడా అంతే గంభీరంగా ఉండాలని లేదు. దానిని సాధారణ మందంతో పెట్టుకోవచ్చు. అప్పుడే ఇంట్లో నడకల సమతుల్యత ఏర్పడుతుంది.

అన్ని ఆలయాలూ ఒకేచోట నిర్మించవచ్చా?-పురాణం రాధ, గద్వాల

హరి, హర క్షేత్రాలు ఒకేచోట ఏన్నో ప్రాంతాలలో మనకు కనిపిస్తాయి. ఇటీవల ఈ విధానం ఎక్కువగా విస్తరిస్తున్నది. దేవుళ్లు ఎందరున్నా అందరు భక్తుల కోసమే కాబట్టి మనుషుల కోసం దేవుళ్లే కలిసి ఉంటున్నారు. ప్రధానంగా ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన పూజాధికాలు, విధి విధానాలు ఉంటాయి. ప్రధానంగా శైవ, వైష్ణవ, స్మార్థ ఆలయాల నిర్మాణాలు, వాటి ఆచార నైవేద్య సంప్రదాయ క్రతువులు విభిన్నం. కాబట్టి ఆలయాలు ఒకే క్షేత్రంలో నిర్మించినా వేరువేరు ప్రాకారాలతో మాడవీధులతో నిర్మాణం జరుపడం అవసరం. వ్యవహారికంగా నిష్ఠగా ఏ ఆలయ సంప్రదాయాన్ని ఆ ఆలయంలో నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని నిర్దిష్ట పద్ధతులు అవలంభించాలి. క్షేత్ర మహిమలు స్థలంలో స్వయం సిద్ధంగా వెలిసిన వాటికి రావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. అన్ని కూరలు ఆరగించేది ఒక్కరే అయినా దేని వంట ప్రాధాన్యం దానిదేకదా. భక్తిలో తేడా ఉండకపోయినా ఆయా గుడి విధివిధానాలను అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకే ప్రాంతంలో ఎన్ని ఆలయాలు నిర్మించినా వాటివాటి వ్యవహారిక పూజా విధానాలకు తగిన విధంగా ఆగమానుసారం వసతులు, పద్ధతులు పాటిస్తూ సరైన విధంగా ప్రాకార, ఆకార, విఘ్నాలు రాకుండా ఒకేచోట నిర్మించుకోవచ్చు. ఆలయాల తాత్విక భావన ఒకటే అయినా నిర్మాణ సరళిలో వ్యవహారిక వ్యత్యాసాన్నే అనుసరించాల్సి ఉంటుంది.
Vasthu

ఫస్ట్‌ఫ్లోర్‌లో కూడా ఇంటి చుట్టూ నడిచేవిధంగా బాల్కనీ తప్పకుండా ఇవ్వాలా? రాకున్నా ఏమీ కాదా?-జి.వనిత, ఆలేరు

ఇంటికి ప్రదక్షిణంగా ఖాళీ వదలాలి. చుట్టు అనేది గొప్ప ఆరోగ్య సూత్రం. తద్వారా ఇల్లు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అది ఎంత వదలాలి అనేది ఇంటి నిర్మాణం, మన అవసరం, స్థలం ఎంత ఉంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఇంటి చుట్టూ ఖాళీ తప్పనిసరి. అది పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా సరే. ఇక మొదటి అంతస్తు మీద ఇంటి చుట్టూ ఖాళీ వచ్చేలా బాల్కనీ ఇచ్చుకోవచ్చు. అది ఎంత అనేది మన ఇష్టం. అయితే తప్పనిసరిగా పైమేడకు కూడా జాగా ప్రదక్షిణం రావాలి అనేది లేదు. కొన్నిసార్లు స్థలం అవసరం కాబట్టి పడమర, దక్షిణం బాల్కనీలు లేకుండా కూడా ఇల్లు నిర్మించాల్సి రావచ్చు. అలాగని అది దోషంగా భావించవద్దు. కారణం కింద గ్రౌండ్‌లో ఎలాగూ ప్రదక్షిణం వదిలాము కాబట్టి ఇబ్బందిలేదు. అయితే తప్పక ఉత్తరం తూర్పు బాల్కనీలు అవసరం ఉంటాయి. ఏ ముఖద్వారం ఇంటికైనా ఇల్లు ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నవి ఇంటి ఖాళీపైనే ఆధారం అన్నది
మరువద్దు.

230
Tags

More News

VIRAL NEWS