హైవేపై హరితకాంతులు


Wed,August 14, 2019 01:38 AM

1 25 lakh plants planted three years ago

-హైదరాబాద్-విజయవాడ రహదారిపై పచ్చదనం
-మూడేండ్ల కింద నాటిన మొక్కలు 1.25 లక్షలు
-సత్ఫలితాలిస్తున్న తెలంగాణకు హరితహారం

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పచ్చదనంతో అలరారుతున్నది. వాహనదారులు, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. రాష్ట్రంలో అడవుల శాతం పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నది. మూడేండ్ల కిందట హరితహారంలో భాగంగా దారిపొడవునా నాటిన మొక్కలు ఎదుగు తూ.. ఆకుపచ్చ తోరణం లా ప్రయాణికులకు స్వా గతం పలుకుతున్నాయి. రోడ్డుకిరువైపులా పచ్చదనం పరుచుకుని ఆకట్టుకుంటున్నాయి. 2016 జూలై 8నలో రెండోవిడుత హరితహారంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 156 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న హైదరాబాద్ -విజయవాడ హైవేపై ఒకేరోజు 1.25 లక్షలకుపైగా మొక్కలు నాటారు.

haritha-chaitanyam
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద మొక్క కూడా నాటారు. దారి పొడవునా ఆయా మండలాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాట గా.. వాటిని సంరక్షించే బాధ్యతను పలు ప్రభుత్వశాఖలు పర్యవేక్షించాయి. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు చేపట్టాయి. ఫలితంగా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొత్తగూడెం నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వరకు 156 కిలోమీటర్ల మేర రహదారికి రెండువైపులా నాటిన మొక్కలన్నీ ప్రస్తుతం చిన్నపాటి వృక్షాలుగా ఎదిగాయి. మరో ఉద్యమంలా మొదలుపెట్టిన హైవేపై హరితహారం కార్యక్రమంతో హరితకాంతులు వెదజల్లుతున్నాయి.

369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles