బోధన్ దవాఖానలో బాలిక ప్రసవం

Thu,October 10, 2019 02:22 AM

శక్కర్‌నగర్: నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవాఖానలో బుధవారం తెల్లవారుజామున 14 ఏండ్ల బాలిక ఆడశిశువుకు జన్మనివ్వగా.. ఆ శిశువు విక్రయానికి య త్నించారు. బోధన్‌లోని బెల్లాల్‌లోని ఇందిరమ్మకాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబానికి చెందిన బాలిక నిజామాబాద్‌లో ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుని జీవనం సాగిం చేది. బాలికను నిజామాబాద్‌కు చెందిన ఫైజ్ అనే ఆటో డ్రైవర్ పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. గర్భం దాల్చిన బాలికకు పురిటినొప్పులు రావడంతో బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు బాలికకు ప్రసవంచేయగా.. ఆడపిల్ల జన్మించింది. దవాఖానలో శిశువును అమ్మేందుకు యత్నిస్తున్నారని ఐసీడీఎస్ సీడీపీవో లలితకుమారి, బోధన్ ఆదర్శ యువతి మహిళా మండలి అధ్యక్షురాలు పద్మాసింగ్‌లకు సమాచారం అందిం ది. వారు దవాఖానకు చేరుకొని ఆరాతీయగా విషయం బయటపడింది. వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. శిశువును ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు రాధిక, సౌభాగ్య స్వాధీనం చేసుకున్నారు.

684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles