సంక్షేమానికి ప్రాధాన్యం

Tue,September 10, 2019 02:24 AM

- బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రగతికి రూ.7,919.96 కోట్లు
- కల్యాణలక్ష్మి, స్కాలర్‌షిప్‌లకు రూ.4,797 కోట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికంగా, సామాజికంగా ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. సోమవారం సీఎం కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌ మొత్తాన్ని రూ.1,46,492.30 కోట్లు ప్రకటించగా.. అందులో సంక్షేమానికి అధిక నిధులు కేటాయించారు. వచ్చే ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.7,919.96 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో స్కాలర్‌షిప్‌ల కోసం రూ.3,257 కోట్లు, కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,540 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. నిరుపేదల సంక్షేమానికి అండగా ఉంటామని బడ్జెట్‌లో కేటాయింపుల ద్వారా మరోసారి రుజువుచేశారు.

Kalyana-Lakshmi1

126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles