ప్రజారోగ్యానికి పెద్దపీట

Tue,September 10, 2019 01:57 AM

- వైద్యరంగానికి రూ.5,694.17 కోట్లు
- ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌కు రూ.1,336 కోట్లు


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఐదేండ్లుగా రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది. వైద్యరంగంలో అనూహ్య మార్పులు తెస్తూ.. సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెంచిన ప్రభుత్వం.. ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యరంగానికి అధి క మొత్తంలో నిధులు కేటాయించింది. వచ్చే ఆరునెలల్లో పలు కార్యక్రమాల నిర్వహణకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.5,694.17 కోట్లు ప్రకటించింది. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌లో రూ.699.44 కోట్లు కేటాయించగా ఈ సారి ఆ మొత్తాన్ని భారీగా పెంచింది. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌కు రూ.1,336 కోట్లు కేటాయించింది. గతేడాదికన్నా ఈసారి రూ.636.56 కోట్లు పెంచింది.

228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles