16 నుంచి మత్స్యజాతర


Wed,August 14, 2019 01:47 AM

80 cr fishlings to be dropped into water bodies in kaleshwaram project

-నాలుగో విడుత పంపిణీకి సర్వం సిద్ధం
-ఇప్పటికే మూడు విడుతల్లో 127 కోట్ల చేపపిల్లలు విడుదల
-కాళేశ్వరం ప్రాజెక్టులో చేపపిల్లలను వదలనున్న మంత్రి తలసాని

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చెరువుల్లో నాలుగో విడుత ఉచిత చేపపిల్లల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల నీటి వనరుల్లో 80 కోట్ల చేపపిల్లలు, ఐదు కోట్ల రొయ్యపిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 24 వేల చెరువుల్లో ఇప్పటివరకు 4,590 చెరువుల్లో మూడో వంతు నీరు చేరడంతో.. ముందుగా నాలుగు వేల చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేసేందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో చేపపిల్లలను విడుదల చేయడం ద్వారా మత్స్యశాఖ మంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ తెలిపారు. నాలుగో విడత చేపపిల్లల విడుదల కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని మంగళవారం వారి కి రాసిన లేఖలో మంత్రి తలసాని కోరారు.

మూడు విడుతల్లో రూ.110 కోట్లు వ్యయం

2016-17లో మొదటి విడుత కింద 3,939 నీటి వనరుల్లో 27.85 కోట్ల చేపపిల్లలను వదిలారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.22.46 కోట్లు ఖర్చు చేసింది. రెండో విడుతలో 11,067 నీటి వనరుల్లో 51 కోట్ల చేపపిల్లలను మత్స్యశాఖ విడుదల చేసింది. ఇందుకోసం రూ.44.08 కోట్లు ఖర్చుచేసింది. 2018-19లో మూడో విడుతలో 10,772 నీటి వనరుల్లో 49.15 కోట్ల చేపపిల్లలను రూ.43.10 కోట్ల వ్యయంతో విడుదల చేశారు. నాలుగో విడుత కింద అన్ని జలవనరుల్లో కలిపి 80 కోట్ల పిల్లలను వదలాలని నిర్ణయించారు. గత నీటివనరులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా అందుబాటులోకి వచ్చిన 20 వేల హెక్టార్ల నీటి వనరుల్లో 1.24 కోట్ల చేపపిల్లలు, 25 లక్షల రొయ్యపిల్లలను వదలనున్నారు. లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌లోని 9,400 హెక్టార్ల విస్తీర్ణంలో 47 లక్షల చేపపిల్లలు, 11.75 లక్షల రొయ్యపిల్లలు, సరస్వతి (అన్నారం) బరాజ్ పరిధిలోని 7,200 హెక్టార్ల విస్తీర్ణంలో 36 లక్షల చేపపిల్లలు, 9 లక్షల రొయ్యపిల్లలు, పార్వతి (సుందిల్ల) బరాజ్ కింద 4,200 హెక్టార్ల విస్తీర్ణంలో 21 లక్షల చేపపిల్లలు, 5.25 లక్షల రొయ్యపిల్లలను వదిలేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
talasani-srinivas-yadav2

994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles