విద్యకు రూ.9,899 కోట్లు

Tue,September 10, 2019 02:16 AM

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: 2019-20 వార్షిక బడ్జెట్‌లో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య కోసం రూ.9,899.82 కోట్ల నిధులు ప్రతిపాదించారు. ఓయూకు రూ.309.53 కోట్లు, కేయూ రూ.79.53 కోట్లు గ్రాంటుగా కేటాయించారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు కలిపి రూ.480 కోట్లు ప్రతిపాదించారు. పాఠశాల విద్యాశాఖలో సాధారణ విద్యకోసం రూ.7,270.70 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ.387.01 కోట్లు, రాజీవ్‌ విద్యామిషన్‌ కోసం రూ. 135.41 కోట్లు ప్రతిపాదించారు. గురుకుల విద్యాలయాలకు రూ. 122.52 కోట్లు, మండల పరిషత్తు పాఠశాలల గ్రాంట్ల కోసం రూ.3,092.47 కోట్లు చూపారు. ఉన్నత విద్యాశాఖకు రూ.483.70 కోట్లు, కళాశాలల విద్యకు రూ.338.30 కోట్లు, ఇంటర్మీడియట్‌ విద్య కోసం రూ.484.99 కోట్ల్ల నిధులు ప్రతిపాదించారు.


EDUCATION1

328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles