ఏసీ మిర్చి క్వింటా రూ.14,700


Wed,August 14, 2019 01:02 AM

ac chilli quintal rate is 14700

-ఖమ్మం మార్కెట్లో రికార్డు ధర
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తొలిసారిగా తేజా ఏసీ రకం మిర్చి పంటకు రికార్డు స్థా యిలో ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్విం టాల్ రూ.14,700కు ఖరీదుదారులు కొనుగోలు చేశారు. సీజన్ ఆరంభంలో ఈ రకానికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,500 పలుకగా, ప్రస్తుతం రూ. 14,700కు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తికి సైతం మంచి ధర పలికింది. ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పత్తి క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.5,775 రాగా, కనిష్ఠ ధర రూ.5,200 పలికిందని అధికారులు తెలిపారు.

562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles