రూ.15 లక్షలు డిమాండ్‌చేసి..

Fri,November 8, 2019 02:03 AM

-ఏసీబీకి చిక్కిన మేడ్చల్ డీపీవో
-ఓ మాజీ సర్పంచ్ వద్ద రూ.లక్ష తీసుకుంటుండగా పట్టివేత
-స్పెషల్ ఆడిట్ రికార్డులను మార్చి రాసేందుకు లంచం డిమాండ్
-కలెక్టరేట్‌లో రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/మేడ్చల్ కలెక్టరేట్/పేట్‌బషీరాబాద్: రూ.లక్ష లంచం తీసుకుంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) రవికుమార్ గురువారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ పదవీకాలంలో ఖర్చుచేసిన నిధులకు సంబంధించి స్పెషల్ ఆడిట్‌ను అనుకూలంగా మార్చేందుకు డీపీవో రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్‌చేశాడు. చివరికి రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

వారి సూచన మేరకు మాజీ సర్పంచ్ ఈశ్వర్ గురువారం మధ్యాహ్నం మేడ్చల్ కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవోకు అడ్వాన్స్‌గా రూ.లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, రూ.లక్ష స్వాధీనం చేసున్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను తనిఖీలుచేసి వెంట తీసుకెళ్లారు. కొంపల్లిలోని డీపీవో రవికుమార్ నివాసంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డీపీవోను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో హైదరాబాద్ సీటీ-1 సీఐలు వెంకటేశ్వర్లు, రఘునందన్, నలుగురు ఏసీబీ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగులు వేధిస్తే 9440446140లో సంప్రదించాలని ఏసీబీ డీఎప్సీ సూర్యనారాయణ సూచించారు.

844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles