మహారాష్ట్ర ఎన్నికల బరిలో ఎంఐఎం !


Wed,August 14, 2019 01:20 AM

 AIMIM enters election fray in Maharashtra

- 20-30 చోట్ల పోటీకి యోచన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఎంఐఎం సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రకాశ్‌అంబేద్కర్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకు చర్చలు జరుపనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే అక్టోబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ముస్లిం మైనార్టీల ప్రాబల్యమన్న 20 నుంచి 30 నియోజకవర్గాలపై మజ్లిస్ పార్టీ గురిపెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీచేసిన మజ్లిస్.. ఔరంగాబాద్, ముంబై బైకుల్లా నియోజకవర్గాల నుంచి విజయం సాధించింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రకాశ్ అంబేద్కర్ పార్టీతో మజ్లిస్ పొత్తు పెట్టుకొన్నది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles