పీఏసీ చైర్మన్‌ అక్బరుద్దీన్‌

Mon,September 23, 2019 02:37 AM

-అంచనాల కమిటీకి సోలిపేట రామలింగారెడ్డి
-పీయూసీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డి
-శాసనసభ, మండలి కమిటీల నియామకం
-మొత్తం 21 కమిటీలకు సభ్యుల ప్రకటన
-ఉభయసభలకు 21 కమిటీలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ శాసనసభ, మండలి కమిటీలను అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం శాసనసభలో ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ), పబ్లిక్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (పీఈసీ), పబ్లిక్‌ అండర్‌టేకింగ్‌ కమిటీ (పీయూసీ)లతో సహా మొత్తం 21 కమిటీలను ప్రకటించారు. ఇందులో మూడు ఫైనాన్స్‌ కమిటీలు ఉండగా.. ఉభయసభల సభ్యులు మెంబర్లుగా ఉంటారు. శాసనసభకు ప్రత్యేకంగా నాలుగు, శాసనమండలికి ప్రత్యేకంగా ఐదు కమిటీలు, మరో తొమ్మిది కమిటీలు ఉభయసభల సభ్యులతో ఏర్పాటుచేశారు. కమిటీల చైర్మన్లు, సభ్యులను ప్రకటిస్తూ ఆదివారం రాత్రి బులెటిన్‌ విడుదలచేశారు. ఫైనాన్స్‌ కమిటీల్లో అసెంబ్లీ నుంచి తొమ్మిది మంది, శాసనమండలి నుంచి నలుగురు చొప్పున సభ్యులుగా ఉంటారు. సామాజికవర్గాలవారీగా అసెంబ్లీ కమిటీలను నియమించారు. పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఎంఐఎంకు పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. పీఈసీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, పీయూసీ చైర్మన్‌గా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని నియమించారు.

పీఏసీ: చైర్మన్‌- అక్బరుద్దీన్‌ ఒవైసీ. సభ్యులు- ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, రమావత్‌ రవీంద్రకుమార్‌, బిగాల గణేశ్‌గుప్తా, గాదరి కిశోర్‌కుమార్‌, పీ విఠల్‌రెడ్డి, డీ శ్రీధర్‌బాబు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుంకరి రాజు, జాఫ్రీ, డీ రాజేశ్వర్‌రావు.

పీఈసీ: చైర్మన్‌- సోలిపేట రామలింగారెడ్డి. సభ్యులు- ఎమ్మెల్యేలు కొనేరు కోనప్ప, చిరుమర్తి లింగయ్య, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జాజుల సురేందర్‌, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, రాజాసింగ్‌, ఎమ్మెల్సీలు వీ భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఆకుల లలిత, హస్సన్‌ ఇఫెండి.

పీయూసీ: చైర్మన్‌- ఆశన్నగారి జీవన్‌రెడ్డి. సభ్యులు- ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టీ ప్రకాశ్‌గౌడ్‌, వీఎం అబ్రహం, బీ శంకర్‌నాయక్‌, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, సయ్యద్‌ అహ్మద్‌ బాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్‌, టీ జీవన్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌.

అసెంబ్లీ రూల్స్‌ కమిటీ: చైర్మన్‌- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. సభ్యులు- మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి, మల్లు భట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య, రాజాసింగ్‌.

ప్రివిలెజ్‌ కమిటీ: చైర్మన్‌- డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావు. సభ్యులు- దానం నాగేందర్‌, సీ లక్ష్మారెడ్డి, జోగు రామన్న, తాటికొండ రాజయ్య, జాఫర్‌ హుస్సేన్‌, మల్లు భట్టి విక్రమార్క.

పిటిషన్స్‌ కమిటీ: చైర్మన్‌- డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావు. సభ్యులు- సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, గూడెం మహిపాల్‌రెడ్డి, బీ హర్షవర్ధన్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

ప్రభుత్వ హామీల కమిటీ: చైర్మన్‌- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. సభ్యులు- రసమయి బాలకిషన్‌, చల్లా ధర్మారెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌, చంటి క్రాంతికిరణ్‌, కే మహేశ్‌రెడ్డి, కోరుకంటి చందర్‌.

ఉభయసభల కమిటీలు

ఎస్టీ కమిటీ: చైర్మన్‌- డీఎస్‌ రెడ్యానాయక్‌. సభ్యులు- ఎమ్మెల్యేలు ఆర్‌ రవీంద్రకుమార్‌, ఆత్రం సక్కు, శంకర్‌నాయక్‌, రాథోడ్‌ బాపూరావు, ఎం భూపాల్‌రెడ్డి, హరిప్రియానాయక్‌, లావుడ్య రాములు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి.

బీసీ కమిటీ: చైర్మన్‌- అంజయ్య. సభ్యులు- ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, నన్నపునేని నరేందర్‌, ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కే జనార్దన్‌రెడ్డి.

ఎస్సీ కమిటీ: చైర్మన్‌- కాలె యాదయ్య. సభ్యులు- ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, దుర్గం చిన్నయ్య, రసమయి బాలకిషన్‌, మెతుకు ఆనంద్‌, సుంకె రవిశంకర్‌, ధనసరి అనసూయ (సీతక్క), ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, ఎగ్గె మల్లేశం, డీ రాజేశ్వర్‌రావు.

మైనార్టీ కమిటీ: చైర్మన్‌- ఫరీదుద్దీన్‌. సభ్యులు- ఎమ్మెల్యేలు టీ ప్రకాశ్‌గౌడ్‌, బిగాల గణేశ్‌గుప్తా, మాగంటి గోపీనాథ్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, కే మాణిక్‌రావు, బలాల, స్టీఫెన్‌సన్‌, ఎమ్మెల్సీలు జాఫ్రీ, డీ రాజేశ్వర్‌రావు, ఫారూఖ్‌హుస్సేన్‌.

లైబ్రరీ కమిటీ: చైర్మన్‌- ఎస్‌ రాజేందర్‌రెడ్డి. సభ్యులు- ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, చల్లా ధర్మారెడ్డి, హరిప్రియానాయక్‌, కందాల ఉపేందర్‌రెడ్డి, ఎం సంజయ్‌, రోహిత్‌రెడ్డి, ధనసరి అనసూయ, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కే నవీన్‌రావు, కే జనార్దన్‌రెడ్డి.

స్త్రీ శిశు సంక్షేమ కమిటీ: చైర్మన్‌- రేఖానాయక్‌. సభ్యులు- నోముల నర్సింహయ్య, పద్మాదేవేందర్‌రెడ్డి, సీహెచ్‌ మదన్‌రెడ్డి, జీ విఠల్‌రెడ్డి, హరిప్రియానాయక్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎం నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ఎం శ్రీనివాస్‌రెడ్డి, కే రఘోత్తంరెడ్డి.

సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ: చైర్మన్‌- చెన్నమనేని రమేశ్‌. సభ్యులు- ఎమ్మెల్యేలు డీ సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద, వీ సతీశ్‌కుమార్‌, మెతుకు ఆనంద్‌, కాలేరు వెంకటేశ్‌, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, తేరా చిన్నపురెడ్డి, ఎన్‌ రామచందర్‌రావు.

వసతుల కమిటీ: చైర్మన్‌- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. సభ్యులు- మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, వనమా వెంకటేశ్వర్‌రావు, బీ కృష్ణమోహన్‌రెడ్డి, కౌసర్‌ మోహినుద్దీన్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుంకరి రాజు, ఎన్‌ రామచందర్‌రావు.

వైల్డ్‌ లైఫ్‌, పర్యావరణ పరిరక్షణ కమిటీ: చైర్మన్‌- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. సభ్యులు- ఎమ్మెల్యేలు చిట్టెం రామోహన్‌రెడ్డి, ఆత్రం సక్కు, ఎం భూపాల్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, మోజంఖాన్‌, పోడెం వీరయ్య, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్‌, శేరి సుభాష్‌రెడ్డి, హస్సన్‌ ఇఫెండి.

మండలి రూల్స్‌ కమిటీ: చైర్మన్‌- మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి. సభ్యులు- మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, హస్సన్‌ ఇఫెండి, టీ జీవన్‌రెడ్డి, ఎన్‌ రాంచందర్‌రావు.

ప్రివిలేజస్‌ కమిటీ: చైర్మన్‌- డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌. సభ్యులు- పట్నం నరేందర్‌రెడ్డి, హుస్సేన్‌ ఇఫెండి, ఫారూఖ్‌హుస్సేన్‌, నాయిని నర్సింహారెడ్డి.

పిటిషన్స్‌ కమిటీ: చైర్మన్‌- మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌. సభ్యులు- కసి రెడ్డి నారాయణరెడ్డి, పురాణం సతీశ్‌కుమార్‌, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ రామ చందర్‌రావు.

ప్రభుత్వ హామీల కమిటీ: చైర్మన్‌- వీ గంగాధర్‌గౌడ్‌. సభ్యులు- ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, కే రఘోత్తంరెడ్డి.

పేపర్స్‌ లెయిడ్‌ ఆన్‌ ది టేబుల్‌:చైర్మన్‌- సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ. సభ్యులు- వీ భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, కే నవీన్‌రావు, టీ జీవన్‌రెడ్డి.

* దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ యూజర్స్‌ కమిటీ సభ్యుడిగా వరంగల్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను స్పీకర్‌ నియమించారు.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles