మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

Thu,October 10, 2019 03:30 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మద్యం దుకాణాల టెండర్లకు బుధవారం నుం చి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో సర్కార్ నూతన మద్యం విధానం ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన మద్యం పాలసీపై బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 వరకు కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వారు ఏ ప్రాంతంలో మద్యం దుకాణానికి టెండర్ వేయాలనుకుంటున్నారో ఆ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం లేదా డివిజినల్ కార్యాలయంలో పూర్తిచేసిన దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2లక్షలు డీడీ చెల్లించాల్సి ఉం టుంది. దరఖాస్తు సమర్పించినవారికి ఒక టోకె న్ నంబర్ కేటాయిస్తారు. లక్కీడ్రాలో ఎవ రి నంబర్ వస్తే వారికి టెండర్ వచ్చినట్టుగా ప్రకటిస్తారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఈ నెల 18న ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీడ్రా తీయనున్నట్టు అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో తొలిరోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ అధికారులు చెప్పారు.


రాష్ట్రంలో 34 రిటైల్ అప్లికేషన్ సెంటర్లు: సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 34 రిటైల్ వైన్‌షాప్‌ల అప్లికేషన్ సెంటర్లు ఏర్పాటుచేసినట్టు ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం ఆబ్కారీ భవన్‌లో ఆశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రిటైల్‌షాప్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దరఖాస్తులను తీసుకోవడానికి ఏర్పాటుచేసిన సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆబ్కారి భవన్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్‌ను మంత్రి పరిశీలించారు. ఆబ్కారిశాఖ అధికారులు నిరంతరం అప్రమత్తగా ఉండాలని, పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి అధికారులను కోరారు.

917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles