ఆర్మీ ర్యాలీలో సత్తాచాటండి


Wed,September 11, 2019 02:15 AM

army carnal srinivas rao inspects pre army recruitment rally training center

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చేనెలలో కరీంనగర్‌లో జరుగనున్న ఆర్మీ నియామక ర్యాలీలో సత్తాచాటాలని, ప్రతిఒక్కరు విశ్వాసంతో ర్యాలీలో పాల్గొనాలని సింగరేణి డైరెక్టర్ బలరాం, సికింద్రాబాద్ ఆర్మీ శిక్షణ కేంద్రం కర్నల్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో కోల్‌బెల్ట్ ఏరియాలో నిర్వహిస్తున్న ప్రీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శిక్షణ శిబిరాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంతోపాటు మొబైల్‌ఫోన్లను దూరంపెట్టి ఆత్మవిశ్వాసంతో సైనిక ఉద్యోగాలకు ఎంపిక కావాలని సూచించారు. కార్యక్రమంలో నారాయణరావు, శ్యామ్యూల్ సుధాకర్, రజాక్, సుధాకర్, కిరణ్‌బాబు, సందీప్, సంగారావు తదితరులు పాల్గొన్నారు.

239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles