సాఫీగా ప్రజారవాణా

Mon,October 21, 2019 03:28 AM

-యథావిధిగా నడుస్తున్న బస్సులు
-ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు
-మారుమూల గ్రామాలకు సర్వీసులు
- కనిపించని సమ్మె ప్రభావం

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్: ఆర్టీసీ సమ్మె ప్రభా వం లేకుండా ప్రజారవాణా సాఫీగా కొనసాగుతున్నది. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో ప్రయాణికులు ఇబ్బందులు లేకుం డా రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం కూడా బస్సు సర్వీసులు ప్రజలను గమ్యస్థానాలకు చేర్చగా, క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

strike3

పల్లెపల్లెకూ వెళ్తున్న బస్సులు..

కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆదివారం 99.39 శాతం బస్సులు నడిపారు. 656 బస్సులకు 652 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. 458 ఆర్టీసీ, 194 అద్దె బస్సులు ఉన్నాయి. 503 బస్సుల్లో టిమ్స్, వంద బస్సుల్లో టికెట్ల ద్వారా చార్జీలు వసూలు చేసినట్టు ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు. మెదక్ రీజియన్ పరిధిలో 524 బస్సు లు ప్రయాణికులకు సేవలందించాయి. అందు లో 366 ఆర్టీసీ, 158 ప్రైవేట్ బస్సులు తిరిగా యి. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల నుంచి ఆదివారం 180 నడిచాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల్లో బస్సులు యథావిధిగా నడిచాయి. ఖమ్మం డిపోలో 103, మధిరలో 51, సత్తుపల్లి డిపోలో 103 బస్సులు నడిచాయి. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, వరంగల్, మిర్యాలగూడ ప్రాంతాలకు బస్సు లు వెళ్లాయి. కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం పరిధిలో 180 ఆర్టీసీ బస్సులు, 64 అద్దె బస్సులు ప్రజలకు సేవలందించాయి.

strike4

ఉమ్మడి పాలమూరులో..

మహబూబ్‌నగర్‌లో ఆదివారం 72 ఆర్టీసీ, 37 అద్దెబస్సులతోపాటు 20 ప్రైవేటు వాహనాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. నారాయణపేట డిపో పరిధిలో 45 ఆర్టీసీ, 34 అద్దె బస్సులు దాదాపు 12 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. వనపర్తి జిల్లాలో ఆదివారం వందశాతం ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 38 గ్రామాలకు సర్వీసులను నడిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం 95 బస్సు సర్వీసులు ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లాయి. విద్యార్థుల సౌకర్యార్థం 16 నైట్‌హాల్ట్ బస్సులు ఆయా ప్రాంతాలకు వెళ్లాయి.

-నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా డిపో ల పరిధిలో 115 ఆర్టీసీ,76 అద్దె బస్సులు, 111 ప్రైవేటు వాహనాలు నడిపారు. సూర్యాపేట డిపో పరిధిలో 43 ఆర్టీసీ, 45 అద్దె బస్సులను నడిపారు. చిన్న చిన్న సమస్యల కారణంగా పక్కకు పెట్టిన బస్సులకు మరమ్మతులు చేసి సోమవారం నుంచి మరో పది బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కోదాడ డిపో పరిధి లో 44 ఆర్టీసీ, 29 అద్దె బస్సులను ఆయా రూట్లలో నడిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట డిపో పరిధిలో 60 ఆర్టీసీ, 15 అద్దె బస్సులు, 58 ప్రైవేట్ బస్సులు పరుగులు తీశాయి. సూపర్ లగ్జరీ బస్సు సేవలు అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపశమనం లభించింది.

strike2

వరంగల్ రీజియన్‌లో..

వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో 866 బస్సులుండగా, ఆదివారం 708 బస్సులను నడిపించారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను తిప్పారు. 80 శాతం బస్సుల్లో టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆదివారం బస్సులు యథావిధిగా నడిచాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 273 బస్సులు, కామారెడ్డి జిల్లాలో 178 బస్సులు నడిచాయి.

1107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles