నిబంధనలు పక్కాగా అమలు


Fri,March 15, 2019 02:26 AM

CEO Rajath Kumar Press Meet over Lok Sabha Elections

-4.51 లక్షల బ్యానర్లు, పోస్టర్లు తొలిగించాం
-వెబ్‌సైట్ల నుంచి నేతల ఫొటోలు తీసేస్తున్నాం
-బెల్టుషాపులను వెంటనే మూసేయాలి
-మీడియాతో సీఈవో రజత్‌కుమార్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలుచేస్తున్నామని, నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల ఉమ్మడిస్థలాల్లో 4.51 లక్షల బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, గోడరాతలు, జెండాలు తొలిగించామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన ఈ నెల 11 నుంచే ప్రభుత్వ వెబ్‌సైట్లు, కార్యాలయాల్లో నుంచి ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు తొలగిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 9 స్క్వాడ్లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.ఈ 18న గెజిట్ నోటిఫికేషన్ నాటినుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు స్ట్రాటజిక్ టీమ్స్ రంగంలోకి వస్తాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను పరిశీలించడానికి 432 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 429 ఎస్‌ఎస్టీ, 188 వీఎస్టీ, 106 వీవీటీ, 489 ఎంసీసీ, 95 అకౌంటింగ్ టీమ్స్, 57 ఇతర జిల్లా టీమ్‌లు ఏర్పాటుచేశామని తెలిపారు. మద్యంషాపుల యజమానులు మద్యం విక్రయాల సమయం పాటించాలని, వెంటనే బెల్టు షాపులు మూసివేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 90.50 లక్షల నగదును సీజ్‌చేసినట్టు తెలిపారు. డీజీపీ, నగర పోలీస్ కమిషర్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిబంధనలను కచ్చితంగా మానిటరింగ్ చేయాలని ఆదేశించినట్టు సీఈవో రజత్‌కుమార్ చెప్పారు.

డబ్బు, మద్యం ప్రవాహానికి చెక్

ఎన్నికల్లో డబ్బు, మద్య ప్రవాహాన్ని అడ్డుకొనేందుకు జిల్లాల సరిహద్దుల్లో నిఘా ఉంచామని రజత్‌కుమార్ తెలిపారు. రాష్ట్రాల సరిహద్దుల్లో ఎక్సైజ్ చెక్‌పోస్టులన్నింటి వద్ద నిఘా పెంచామన్నారు. లక్ష్మీస్‌ఎన్టీఆర్ సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీనిపై ఈసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కులం, మతం, భాష, ప్రాంతీయం పేరుతో ఓట్లు అడుగకూడదని, ఇది ఎంసీసీ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు. 0.5 సెక్షన్ కింద అధికారుల పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)లు నిర్వహించవచ్చునని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తారని తెలిపారు. 25న ఫైనల్ సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, ఏప్రిల్ 5వ తేదీలోపు ఫొటో ఓటర్‌స్లిప్‌లను పంపిణీ చేస్తామని వివరించారు.

844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles