ఇది పనిచేసే ప్రభుత్వం

Sun,September 22, 2019 02:12 AM

-ఉద్యోగులకు ఐఆర్, ఫిట్‌మెంట్‌పై త్వరలో నిర్ణయం
-పద్దులపై చర్చలో మంత్రి టీ హరీశ్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రచార సర్కారు కాదని, పనిచేసే ప్రభుత్వమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఉద్యోగులకు సంబంధించి ఐఆర్, ఫిట్‌మెంట్ వంటి అంశాలు సీఎం పరిశీలనలో ఉన్నాయని, వాటిపై త్వరలో నిర్ణ యం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీలో శనివారం సాధారణ పరిపాలన విభాగం పద్దుపై మంత్రి సమాధానమిస్తూ.. ఏ రాష్ట్రం లో లేనివిధంగా జర్నలిస్టులు, న్యాయవాదులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులకు ప్రత్యేకనిధి ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పటివరకు 1,49,382 ప్రభుత్వోద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కాగా.. 1,17,714 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిందని, మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉన్నదని చెప్పారు. ఉద్యోగులు 42 శాతం ఫిట్‌మెంట్ అడిగితే 43%, కార్పొరేట్ దవాఖానల్లో నగదురహిత వైద్యసేవలు అందించేలా హెల్త్‌కార్డులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దనన్నారు. సచివాల యం పాత భవనంలోని ఫైల్స్‌ను భద్రపరచడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కస్టోడియన్ అధికారులను నియమించి, పక్కాగా తరలిస్తున్నామన్నారు.

జూ.లాయర్లకు శిక్షణ ఇవ్వాలి: ఎమ్మెల్యే కాలేరు

సుప్రీంకోర్టులో ప్రభుత్వ కేసులు వాదించేం దు కు వీలుగా జూనియర్ లాయర్లకు శిక్షణ ఇప్పిం చాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు.

రైతుబంధును ఆదర్శంగా తీసుకుంటారు.

శ్రీధర్‌బాబుతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సమాచారశాఖ పద్దుపై మాట్లాడే సందర్భంలో కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్‌బాబు తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల్లోని పత్రికల్లోనూ ప్రచారం చేసుకుంటున్నదంటూ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలుగజేసుకుని ఓ సూచనచేశారు. తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతుబంధుపై ప్రచారంచేశామని, ఇతర రాష్ర్టాలు ఆ పథకాన్ని ఆదర్శంగా తీసుకుంటే అక్కడి రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ సభ్యులు పార్టీ ఫిరాయించారని శ్రీధర్‌బాబు అనడంపై శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అవి ఫిరాయింపులు కావని.. చట్టబద్ధ్దంగా, రాజ్యాంగబద్ధంగా వారంతా టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారని, అందుకు సంబంధించిన బులెటిన్ కూడా విడుదలైందని వివరించారు.

v-PRASHANTH-REDDY

కాన్‌స్టిట్యూషనల్ తరహా క్లబ్: మంత్రి వేముల

సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్ తరహా లో మన రాష్ట్రంలోనూ ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్టు శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. సభ్యులందరికీ ఉపయోగకరంగా ఉండేలా ఈ క్లబ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. సభ్యుల హక్కులను కాపాడేందుకు అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో ప్రత్యేక కమిటీని నెలకొల్పనున్నట్టు పేర్కొన్నారు. సభలో సభ్యులందరూ మాట్లాడేలా అనుమతి లభించిందని, అన్ని పద్దులపై సమగ్ర చర్చ జరిగిందన్నారు.

ERRABELLI-dayakar-rao

ఆసరాకు రూ.9,402 కోట్లు: మంత్రి ఎర్రబెల్లి

ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం ఏటా రూ. 9402.48 కోట్లు ఖర్చుచేస్తున్నదని.. వీటి వల్ల ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి 39,41,976 మంది లబ్ధి పొందారని పంచాయతిరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆసరా పెన్షన్ స్కీం కేంద్ర ప్రభుత్వానిదని కొందరు ప్రచారం చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పెన్షన్లకవుతున్న ఖర్చులో కేంద్రం వాటా రూ.209.60 కోట్లు మాత్రమేనని వివరించారు.

KOPPULA-eshwar

మైనార్టీల కోసం పలు పథకాలు: మంత్రి కొప్పుల

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథ కాలు అమలుచేస్తున్నదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ్యుల ప్రశ్నలకు జవాబుగా చెప్పా రు. రాష్ట్రంలోని ఐదువేల మసీదుల్లో 8,013 మంది ఇమామ్, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవవేతనాన్ని ఇస్తున్నట్టు తెలిపారు.

e-rajender

మార్చురీలకు రూ.17కోట్లు: మంత్రి ఈటల

ప్రభుత్వ దవాఖానల పరిధిలోని మార్చురీల ఆధునీకరణకు రూ.17 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ప్రభుత్వ దవాఖానల్లో చనిపోయిన పేదవారి మృతదేహాలను వారి ఊర్లకు తరలించేందుకు గాంధీ, ఉస్మానియా పరిధుల్లో 20, ఇతర దవాఖానల పరిధిలో 10, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 20 పార్థివ వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు.

GANGULA-kamalakar

బాల్యవివాహాలు తగ్గాయి: మంత్రి గంగుల

కల్యాణలక్ష్మి, షాదీ ము బారక్ పథకం కారణం గా రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయని పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల పెండ్లికి రూ.1,00,116 సహాయంగా ఇస్తున్నట్టు తెలిపారు. రేషన్ బియ్యానికి సంబంధించిన మరో ప్రశ్నకు జవాబిస్తూ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొని.. పంపిణీ చేస్తున్నామన్నారు.

PUVVADA-ajay-kumar

వ్యవసాయ వాహనాలపై పన్ను మినహాయింపు!: మంత్రి పువ్వాడ

వ్యవసాయ రంగంపై ఆధారపడి వాహనాలను నడుపుతున్న వారికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై దృష్టి పెడతామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. శాసనసభలో సభ్యులడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 96.14 లక్షల త్రీ వీలర్ వాహనాలున్నాయని.. వీటిద్వారా లక్షల మంది స్వయంఉపాధి పొందుతున్నారని చెప్పారు.

1154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles