పల్లె ప్రగతిపై నేడు కలెక్టర్లతో సీఎం భేటీ

Thu,October 10, 2019 03:18 AM

30రోజుల కార్యాచరణపై సమీక్ష
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పల్లె ప్రగతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు హాజరుకానున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 30రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులు ఏమిటి? ఆయా గ్రామాల రూపురేఖలు ఏవిధంగా మారుతున్నాయి? గ్రామాల్లో వాటివల్ల జరిగే అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉందన్నదానిపై జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లాలవారీగా తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలపై కలెక్టర్లను అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నది.

436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles