‘చుక్కాని’ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్


Wed,June 12, 2019 02:22 AM

cm kcr inaugurates chukkani book

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు రచించి, ప్రచురించిన చుక్కాని (సంక్షేమ పాలనకు పునర్ నిర్వచనం కేసీఆర్) అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక పని విధానమైతే, పథకాల అమలు వెనుక ఉన్న ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను సాధికారికంగా చెప్పడం ఎంతైనా అవసరమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి రచనలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. వకుళాభరణంను సీఎం కేసీఆర్ అభినందించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పాల్గొన్నారు.

1040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles