గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్


Mon,April 15, 2019 01:04 AM

cm kcr meets governor narasimhan at raj bhavan

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయ్యారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా, అధికారులకు నయాపైసా లం చం ఇవ్వకుండా ప్రజలకు సకాలంలో పనులు జరిగే వ్యవస్థను ఏర్పాటుచేయాలని భావిస్తున్న విషయాన్ని గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రజలకు నిర్ధిష్టమైన సేవలందించడంతోపాటు భూము లు ఉన్న రైతులకు యాజమాన్యహక్కులు కల్పించేలా కంక్లూజివ్ టైటిల్‌యాక్ట్‌పై కూడా చర్చించారు. భూమిశిస్తు, నీటితీరు వా లాంటి రెవెన్యూ వసూళ్లు లేనప్పుడు కలెక్టర్ అనే పదం ఎందుకని.. ఈ మేరకు ఏ పేరుతో పరిపాలనా వ్యవస్థ ఏవిధంగా ఉండాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చా యి. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో విభజన సమస్యపై జరిగిన సమావేశ వివరాలను గవర్నర్‌కు వివరించారు. లోక్‌సభ పోలింగ్ సరళిని తెలియజేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ మేర కు ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.

1150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles