త్వరలో పునర్జీవ పంపుహౌస్‌ల పరిశీలనకు సీఎం కేసీఆర్


Wed,August 14, 2019 01:14 AM

CM KCR to review the gayatri pump house soon

-బాహుబలి ప్రారంభానికి నేడు వస్తున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదు
-కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంపుహౌస్‌లోని బాహుబలి మోటర్లను బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవంలేదని కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, జగన్మోహన్‌రెడ్డితో కలిసి సీఎం కే చంద్రశేఖర్‌రావు జూన్ 21న ప్రారంభించారని గుర్తుచేశారు. అదే రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బరాజులు, పంపుహౌస్‌ల వద్ద పలువురు మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. కాగా, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా కొనసాగుతున్న రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్‌ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం మూడునాలుగు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఇదే సమయంలో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్‌లో ఇప్పటికే వెట్ ట్రయల్న్ చేసిన పంపుల పనితీరును కూడా పరిశీలించే అవకాశం ఉన్నదని వెల్లడించారు.

232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles