విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజ


Wed,August 14, 2019 01:27 AM

cmd Devulapalli Prabhakar Rao inspects pulichintala project

-జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
-పులిచింతల జెన్‌కో కేంద్రం పరిశీలన

చింతలపాలెం: విద్యుదుత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వజినేపల్లి వద్ద పులిచింతల ప్రాజెక్టు అంతర్భాగంలో నిర్మించిన విద్యుత్‌కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అహర్నిశలు శ్రమించి మిగు లు విద్యుత్ రాష్ట్రంగా నిలిపామన్నారు. పులిచింతలలో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించి అతి తక్కువ కాలంలోనే గత ఏడాది పూర్తి చేసి జాతికి అంకితం చేశామన్నారు. నాలుగు యూనిట్ల ద్వారా విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేశామని తెలిపారు. రెండు రోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుకున్నదని, దీంతో ప్రాజెక్టులో ఉన్న 5 వేల క్యూసెక్కుల నీటి ద్వారా 2 యూనిట్లతో 12 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇంకా నీటి ఉధృతి పెరిగితే మిగతా 2 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపడతామని తెలిపారు.

136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles