టీఆర్‌ఎస్ జీవధార


Sat,March 23, 2019 03:21 AM

Congress leaders Nd Tdp leaders  join TRS in presence of KTR

-అన్ని పాయలు ఒక్కటై కలుస్తున్నాయి
-ఇది సీఎం కేసీఆర్ ప్రజాదరణకు నిదర్శనం
-రెండు సీట్లతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్
-పదహారు సీట్లు చేతిలో పెడితే.. వేల కోట్లు తెస్తారు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-కాంగ్రెస్, టీడీపీల నుంచి భారీ సంఖ్యలో చేరికలు

హైదరాబాద్, షాద్‌నగర్, నమస్తే తెలంగాణ/త్రిపురారం:అన్ని పాయలు ఒక్కటై టీఆర్‌ఎస్ అనే జీవధారలో కలుస్తున్నాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. సబ్బండవర్ణాలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, ఆమోదిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాయని చెప్పారు. కేసీఆర్‌కు ఎంతటి ఆదరణ ఉన్నదో దీన్నిబట్టే తెలుస్తున్నదన్నారు. రాష్ట్రంలోని 16 సీట్లలో టీఆర్‌ఎస్ గెలిచి, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తే.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఉరుక్కుంటూ వస్తుందని చెప్పారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, బిష్మ కిష్టయ్య, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాలప్ప నేతృత్వంలో ఎంబీసీలకు చెందిన కులాల ప్రతినిధులు, బిల్డర్స్ ఆసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నాయకులు డీవీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీచేస్తున్న నియోజకవర్గం నుంచి సైతం కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రయోజనాల కోసం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్రమోదీ ప్రయోజనాల కోసం పనిచేస్తారన్న కేటీఆర్.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని చెప్పారు. మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్ గాడితప్పిందని వ్యాఖ్యానించారు. రెండు సీట్లతో తెలంగాణ సాధించిన మొనగాడు కేసీఆర్ చేతిలో 16 సీట్లు పెడితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చని, ఢిల్లీ మెడలు వంచి వేలకోట్ల నిధులు తీసుకువస్తారని చెప్పారు. సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకుపోదామని పిలుపునిచ్చారు.
PRATAPREDDY

సాగునీరందితే ఇంకెంత సంతోషమో: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

తాగునీళ్లు సరఫరాచేస్తేనే ఇంత సంతోషంగా ఉన్న పాలమూరు ప్రజలు.. సాగునీరు సరఫరా చేస్తే ఇంక ఎంత సంతోషంగా ఉంటారోనని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చూసి ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చెప్పారు. కేసీఆర్ పాలనలో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నా రని, వారిలో అపోహలు తొలిగిపోయాయని మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉండగా ప్రజలకు ఏమీచేయలేకపోయామని విచారం వ్యక్తంచేశారు. పనిచేసే పార్టీలో చేరుతున్నానన్న ప్రతాప్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో మిగిలిన నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరాలని సూచించారు. ఎంపీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మినహా ఒక్క పార్టీ మిగులదన్నారు.
BUILDER

షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ఖాళీ

షాద్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, కొందుర్గు జెడ్పీటీసీ బం గారు స్వరూప రాములు, ఎంపీపీలు గాయత్రీ రామకృష్ణ, ఎంపీపీ శివశంకర్‌గౌడ్, బుజ్జిబాబునాయక్, వైస్ ఎంపీపీ నరేందర్‌రెడ్డి, కొందుర్గు మాజీ జెడ్పీటీసీ దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్‌సాదిక్, సర్పంచ్‌లు బాలమణి, కవిత, బాలరాజు, లక్ష్మీదేవి, సుగుణ రవినాయక్, ఎంపీటీసీ కాలేద్, కౌన్సిలర్ పాలమాకుల చెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు కిశోర్, ఖాదర్‌గోరి తదితరులున్నారు. వీరందరి చేరికతో షాద్‌నగర్ కాం గ్రెస్ ప్రధాన నాయకత్వం మొత్తం టీఆర్‌ఎస్‌లో చేరినట్టయిందని స్థానికనేతలు చెప్తున్నారు.
KALAPPA
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో కాంగ్రెస్ త్రిపురారం మండలాధ్యక్షుడు మర్ల చంద్రారెడ్డి, త్రిపురారం సింగిల్‌విండో చైర్మన్ అనుముల నర్సిరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి భైరం కృష్ణ, టీడీపీ త్రిపురారం గ్రామశాఖ అధ్యక్షుడు తాటి సుధాకర్‌రెడ్డి, బెజ్జికల్ ఎంపీటీసీ ఇండ్ల సునీతనాగరాజు, సర్పంచ్‌లు చిలక సుభాష్‌రెడ్డి, కలకొండ వెంకటమ్మసైదయ్య, జీ సునీతవెంకట్‌రెడ్డి, ఎం శ్రీనివాస్, ఇండ్ల కౌసల్యవెంకటయ్య, చిలక స్వప్న, చేపూరి నిర్మల, అభంగాపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాయించు గోవిందు, బెజ్జికల్ గ్రామశాఖ అధ్యక్షుడు మన్నూరి సైదులు తదితరులున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య, కోటిరెడ్డి, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles