నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్

Thu,October 10, 2019 02:26 AM

-హుజూర్‌నగర్‌లో దేవాలయాలు, చర్చిల్లో ఎన్నికల ప్రచారం
-కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు దండే విఠల్‌లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ దేవాలయాలు, చర్చిలో ప్రచారం చేస్తున్నారని, ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని రేవూరు ముదిరాజ్ దేవాలయానికి పీసీసీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెయిన్ సిమెంట్ కంపెనీ ద్వారా రూ.3లక్షల చెక్కు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మఠంపల్లి మండలం బీమలత తండాలోని ఆంజనేయస్వామి దేవాలయంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారని, ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులకు కాంగ్రెస్ కండువా కప్పారని ఫిర్యాదు చేశారు. నేరేడుచర్ల మండలం దర్శించెర్ల గ్రామంలోని తెలుగు బాపిస్టు చర్చిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారంచేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్చి ప్రాంగణంలో ఫాదర్లు, చర్చి సభ్యులతో ఉత్తమ్ సమావేశమై పలు హామీలు ఇచ్చారని తెలిపారు.

211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles