నగరాలకు జలవిహారాలు

Tue,January 14, 2020 03:20 AM

-మిషన్‌ కాకతీయతో పట్టణ చెరువులకు మహర్దశ
-570 కోట్లతో 98 మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం
-అనేక పట్టణాల్లో ఇప్పటికే అందుబాటులోకి
-ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న చెరువులు
-నడకకు ప్రత్యేక ట్రాక్‌లు.. విద్యుద్దీకరణతో సరికొత్త శోభ

ట్యాంక్‌బండ్‌.. ఒకప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన ప్రాంతం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి ఇదొక ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పంచే స్థలం. కానీ ప్రస్తుతం ఏ పట్టణానికి వెళ్లినా మినీ ట్యాంక్‌బండ్‌ అనే మాట విరివిగా వినిపిస్తున్నది. దీనికి కారణం దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ. ఈ పథకంతో అనేక పట్టణాల్లోని చారిత్రక చెరువులు ఆధునిక హంగులతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నిన్నటివరకు పిచ్చి మొక్కలు.. చెత్తా చెదారం, మురికినీటితో కనిపించిన తటాకాలు.. ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అనేక పట్టణాల్లో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌లు.. నగర, పట్టణ ప్రజల జల విహారాలకు కేరాఫ్‌గా మారాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని చారిత్రక చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ.. తాగు, సాగునీటి అవసరాలు తీర్చడమేకాదు.. ప్రజలకు ఉల్లాసాన్ని పంచే సుందర, ఆహ్లాద కేంద్రాలనూ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఇప్పటికే 98 కేంద్రాల్లో రూ.570.58 కోట్ల అంచనాతో ప్రతిపాదనలకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. వీటిలో 90 మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి టెండర్లు పూర్తయి, రూ.319.51 కోట్ల విలువైన పనులకు కాం ట్రాక్టర్లతో ఒప్పందం కుదిరింది. గత ఏడాది నవంబర్‌ వరకు దాదాపు రూ.190 కోట్ల నిధులను వెచ్చించారు. రాష్ట్రంలోని ప్రధాన చెరువులన్నీ దాదాపు కాకతీయులు, ఆసఫ్‌జాహిల కాలంలో నిర్మించినవే. దశాబ్దాలపాటు వీటిని పట్టించుకోకపోవడంతో తెలంగాణ ఏర్పడేనాటికి శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టణాల్లోని ఆవాసాల నుంచి వచ్చే మురుగు నీరు కూడా చేరి మురికికూపాలుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం వీటిని మినీ ట్యాంక్‌బండ్‌లుగా మార్చేందుకు కృషిచేస్తుండటంతో ప్రస్తుతం వాటి రూపురేఖలు మారిపోయాయి.
Mini-tank-bund
కొన్నిచోట్ల చెరువులోని కలుషిత నీటిని ఖాళీ చేసి, మురుగు రాకుండా కట్టడి చేయడంతో వర్షపు నీటితో జలకళ ఉట్టిపడుతున్నది. చెరువు కట్టలను తిరిగి పునరుద్ధరించడంతోపాటు రెండువైపులా పచ్చని చెట్లు, నడకకోసం ప్రత్యేకంగా వాకింగ్‌ ట్రాక్‌లు, చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపి, చిన్నారులు ఆడుకునేలా, ప్రజలు సేద తీరేందుకు కూడా ఏర్పాట్లుచేశారు. రాత్రివేళల్లో ఆహ్లాదంగా కనిపించేందుకు విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. అనేకచోట్ల బోటింగ్‌కు ఏర్పాట్లుచేస్తుండటంతో మినీ ట్యాంక్‌బండ్‌లు పర్యాటకకేంద్రాలుగా మారుతున్నాయి. మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, దుబ్బాక, భువనగిరి, సూర్యాపేట, ఆలేరు, నల్లగొండ, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, జనగామ, వరంగల్‌ తూర్పు, పశ్చిమ, డోర్నకల్‌, ఖమ్మం పట్టణాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన అత్యధిక ప్రాంతాల్లో 50- 95 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. 50 శాతంపైగా పనులు పూర్తయిన పట్టణాల్లోనూ మినీట్యాంక్‌బండ్‌లను ప్రజలు వినియోగించుకుంటున్నారు.

బతుకమ్మ ఉత్సవాలకు సరైన వేదిక


తొమ్మిది రోజులపాటు సాగే బతుకమ్మ పండుగలో వాటిని నిమజ్జనానికి గ్రామాల్లో బావులు ఉంటాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మినీ ట్యాంక్‌బండ్‌ల ఏర్పాటుతో ఆ ఇబ్బందులు తొలిగిపోయాయి. పచ్చని చెట్లతో రాత్రివేళల్లో విద్యుత్‌కాంతులు విరజిమ్ముతుండగా.. వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. నిమజ్జనాలకు వీలుగా మినీ ట్యాంక్‌బండ్‌లవద్ద ఘాట్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నారు.
Mini-tank-bund1

భానుపురి బండ్‌ సూర్యాపేటలో మినీ


Mini-tank-bund2
ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకున్న సద్దుల చెరువు పట్టణానికి
మణిహారంగా మారింది. కట్టపై మూడు ప్రాంతాల్లో సుందరీకరణ, గార్డెనింగ్‌, ప్రజలు కూర్చునేందుకు ఏర్పాట్లు, రకరకాల
పూలమొక్కలతో పర్యాటక కేంద్రంగా తయారైంది.
Mini-tank-bund5
-రూపుమారిన పెద్దచెరువు..ఒకప్పుడు కాలుమోపటానికి కూడా అనుకూలంగాలేని పరిస్థితి నుంచి.. వెళితే తిరిగి రావటానికి మనస్కరించని పరిస్థితికి మహబూబ్‌నగర్‌ పెద్ద చెరువు మారిపోయింది. రాత్రివేళల్లో విద్యుత్‌కాంతులతో వెలిగిపోయే ఈ ప్రాంతం పట్టణానికే సరికొత్త శోభను తెచ్చింది.

ఆకట్టుకుంటున్న కోమటి చెరువు


Mini-tank-bund3
రాష్ట్రంలోనే ఐకాన్‌గా నిలిచింది సిద్దిపేట కోమటి చెరువు. తొలుత మిషన్‌ కాకతీయ కింద మొదలైన మినీ ట్యాంక్‌బండ్‌.. ఇప్పు డు ప్రముఖ పర్యాటకకేంద్రంగా మారింది. వాకింగ్‌ట్రాక్‌, చెరువులో విహరించేందుకు టూరిజంశాఖ ఆధ్వర్యంలో బోట్లు, చెరువు కట్టపై తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా జమ్మిచెట్టు, పాలపిట్ట, బతుకమ్మ ప్రతిమలు, లవ్‌ సిద్దిపేట సింబల్‌, కోమటి చెరువు కళాక్షేత్రం.. జాతీయ జెండా రెపరెపలు.. యోగా ధ్యానమందిరం, ఓపెన్‌ ఎ యిర్‌ జిమ్‌, పర్యాటకులు సేదతీరేందుకు గజబోల్స్‌, చిల్డ్రన్‌ పార్కులు, అడ్వెంచర్‌ పార్కు, రాక్‌గార్డెన్‌, స్కై సైక్లింగ్‌, జెట్టి బో ట్‌, పాన్‌ తోన్‌ మెకనైజ్డ్‌ బోట్‌, లగ్జరీబోట్‌, లీజర్‌బోట్‌, వాటర్‌స్కూటర్‌, పెడల్‌ బోట్‌, స్పీడ్‌బోట్స్‌, ఎనీటైమ్‌ వాటర్‌, ఫుడ్‌ కోర్టు.. వంటివాటితో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, లుంబినీ పార్కు పరిసరాలను మరి పించేలా తయారైంది. లక్నవరం చెరువు వంతెన తరహాలో వంద అడుగుల ఎత్తైన రెండు పైలాన్ల మధ్యలో గాల్వనైజ్డ్‌ రోప్‌తో 240 మీటర్ల పొడవైన సస్పెన్షన్‌ బ్రిడ్జి చేపట్టారు. దాని మధ్యలో నాలుగు అడుగుల వెడల్పుతో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుచేశారు. ఏకకాలంలో 200 మంది దీనిపై నిల్చొని చెరువు అందాలను తిలకించవచ్చు. చెరు వు మధ్యలో ఐలాండ్‌ ఏర్పాటుచేసి నేచురోపతి కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. కోమటి చెరువు వద్ద 16 రకాల క్రీడాంశాలతో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ పార్కును నిర్మించారు.
Mini-tank-bund4

2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles