ఏడు జిల్లాల్లో పంటనష్టం


Wed,August 14, 2019 12:20 AM

Crop loss in seven districts

-వర్షాలు, వరదలతో 11,800 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
-9,726 ఎకరాల్లో నీటమునిగిన వరినాట్లు
-వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గత పదిరోజుల్లో కురిసిన వర్షాలతో ఏడుజిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల అతివర్షంతో, మరికొన్నిచోట్ల ప్రాజెక్టుల నుంచి వదిలిన నీటి కారణంగా పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో దాదాపు 11,800 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ఇందులో ప్రధానంగా 9,726 ఎకరాల్లో వరినాట్లు నీటమునిగి రైతులు నష్టపోయినట్టు వ్యవసాయశాఖ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. మరో 1,600 ఎకరాల్లో పత్తిపంట నీటమునిగింది.

వర్షాలు అధికంగా కురవడం, పైనుంచి వరద రావడంతో కృష్ణానదికి ప్రవాహం పెరిగి నారాయణపేట జిల్లాలో 6,100 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. జూరాల నుంచి నీటివిడుదలతో 260 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,750 ఎకరాల్లో వరి, 460 ఎకరాల్లో పత్తి, 230 ఎకరాల్లో కందిపంటలు నీటమునిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 19 మండలాల్లోని 95 గ్రామాల రైతులకు అతివర్షాలు నష్టంచేకూర్చినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది.

305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles