శాస్త్రవేత్తలకు స్ఫూర్తిప్రదాత నాయుడమ్మ


Wed,September 11, 2019 03:04 AM

Dr NM award presented to HMR MD nvs Reddy

అవార్డుల ప్రదానసభలో ప్రముఖులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రొఫెసర్ డాక్టర్ నాయుడమ్మ నేటితరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తిప్రదాత అని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొనియాడారు. నాయుడమ్మ 79వ జయంతిని పురస్కరించుకుని తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో యలవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయుడమ్మ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్ఞాన భారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్‌చౌదరి, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. నాయుడ మ్మ అవార్డులను అందుకున్నారు. ముఖ్యఅతిథి అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. నాయుడమ్మ నిమ్నవర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడిన గొప్ప వ్యక్తని, తనతోపాటు చాలామంది ఆయన స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదిగామని తెలిపారు.

ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నాయుడమ్మకు తాను ఏకలవ్య శిష్యుడినని, మరో జన్మ ఉంటే ఆయనే తనకు గురువుగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ బీ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. నిమ్నవర్గాల ప్రగతికి, తోలు పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి గొప్పదని కొనియాడారు. అవార్డు గ్రహీత హనుమాన్‌చౌదరి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ రంగంలోనైనా భారతీయులే ఉన్నారని అన్నారు.

మెట్రోస్టేషన్ చంద్రయాన్‌కు అంకితం: ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్ మెట్రోరైలులో ఒక స్టేషన్‌ను చంద్రయాన్‌కు అంకితం చేస్తామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తార్నాక నుంచి నాగోల్ వరకు సైన్స్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు. కారిడార్‌లోని 150 పిల్లర్లకు యువతను ప్రభావితం చేసి ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రాలు పెట్టేలా ఏర్పాట్లుచేస్తామని తెలిపారు. వాటిలో ఢిల్లీ మెట్రో కు చెందిన డాక్టర్ శ్రీధరన్, వీకే సారస్వత్, క్యాన్సర్ స్పెషలిస్ట్ దత్తాత్రేయుడు నూరి. సామ్‌పిట్రోడా, ఎంఎస్ స్వామినాథన్ వంటివారు ఉన్నారని చెప్పారు.

344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles