గిరిజన సలహా మండలి ఏర్పాటు


Wed,August 14, 2019 01:25 AM

Establishment of a tribal advisory council

-చైర్మన్‌గా సంక్షేమశాఖ మంత్రి
-ముగ్గురు సభ్యులు, ఓ సభ్యకార్యదర్శి
-మరో 15 మంది ఇతర సభ్యులు
-ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి పెట్టపీట వేస్తున్న ప్రభుత్వం.. గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేలా కార్యాచరణ చేపట్టేందుకు గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి బెనహర్ మహేశ్‌దత్ ఎక్కా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. గిరిజన సలహా మండలికి చైర్మన్‌గా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీశాఖ డైరెక్టర్, తెలంగాణ ట్రైబల్ కల్చరల్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, సభ్యకార్యదర్శిగా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఉంటారు. వీరితోపాటు మరో 15 మంది సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరిలో ఎంపీలు మాలోతు కవిత, సోయం బాపురావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, బాపురావు రాథోడ్, అజ్మీరా రేఖానాయక్, రమావత్ రవీంద్రకుమార్, ధరమ్‌సోత్ రెడ్యానాయక్, బానోతు శంకర్‌నాయక్, ధనసరి అనుసూయ, రేగా కాంతారావు, బానోతు హరిప్రియ, మెచ్చ నాగేశ్వర్‌రావు, పోడెం వీరయ్య, లావుడ్య రాములు ఉన్నారు.

84
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles