ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం


Wed,September 11, 2019 02:57 AM

Etela Rajender tour of districts to review fever control measures

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ, సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: ఆరోగ్య తెలంగాణే లక్ష్యం గా ప్రభుత్వం కృషి చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అందుకోసం ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రతి నిరుపేద రోగులకు మెరుగైన వైద్యసేవలందించి, కార్పొరేట్ స్థాయిలో సేవలను ముమ్మరం చేస్తున్నామ న్నారు. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన దవాఖానలను పరిశీలించారు. సూర్యాపేటలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన, మెడికల్ కళాశాలను మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఈటల సందర్శించారు. ఆయాచోట్ల మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో 98 శాతం వైరల్ ఫీవర్సేనని, డెంగీ జ్వరాలు తీవ్రత తక్కువగానే ఉన్నదని చెప్పారు.

జ్వర పీడితులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నెల రోజులపాటు వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు అన్ని కాలాలు పని ఉంటుందని, 365 రోజులు వైద్యులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. మంత్రి వెంట ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్‌పర్సన్లు దీపికాయు గంధర్‌రావు, కోరం కనకయ్య, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు.

182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles