మానవత్వం చాటుకున్న మంత్రి ఈశ్వర్

Thu,October 10, 2019 03:13 AM

దవాఖానకు క్షతగాత్రుల తరలింపు
గొల్లపల్లి: ప్రమాదంలో గాయపడినవారిని వైద్యశాలకు తరలించి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను పోలీసు వాహనంలో జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గొల్లపల్లి- వెనుగుమట్ల మధ్యలో రాఘవపట్నం గ్రామానికి చెందిన బొల్లారపు రాజేశం, గొల్లపల్లికి చెందిన కోమల్ల నరేశ్ ద్విచక్ర వాహనాలపై వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరూ గాయాల పాలయ్యారు. కాన్వాయ్ నుంచి గమనించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే స్పందించి పోలీసు వాహనంలో వైద్యశాలకు తరలించేదాకా దగ్గరుండి చూసుకున్నారు.

519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles