శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విస్తృత తనిఖీలు


Wed,August 14, 2019 12:53 AM

Extensive checks at Shamshabad Airport

-పంద్రాగస్టు సందర్భంగా పటిష్ఠ నిఘా, విజిటర్స్ ప్రవేశపాస్‌లపై ఆంక్షలు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైవేతోపాటు ఎయిర్‌పోర్టు లోనికి వెళ్లే ప్రధాన మార్గాలపై నిఘా చేపట్టారు. ఆంక్షలు ఈ నెల 20 వరకు అమలులో ఉంటున్నందున డొమెస్టిక్ ప్రయాణికులు రెండు గంటల ముందుగా, ఇంటర్నేషనల్ ప్రయాణికులు మూడు గంటల ముందు ఎయిర్‌పోర్టు చేరుకొని తనిఖీలు, ఇతర భద్రతాపరమైన అంశాల్లో సహకరించాలని భద్రతాధికారులు సూచించారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పటిష్ఠ చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు తదితర జనసమర్ధ ప్రదేశాల్లో సీఐఎస్‌ఎఫ్, ఆక్టోపస్, రాష్ట్ర పోలీసు, డాగ్, బాంబ్ స్కాడ్ ఎప్పటికపుడు తనిఖీలు జరుపుతున్నారు.

167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles