ఆన్‌లైన్ చేయడంలేదు


Wed,September 11, 2019 02:31 AM

farmer dharmanna meets dharamaganta over land records

ధర్మగంటను ఆశ్రయించిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతు ధర్మన్న
బిజినేపల్లి: రెండేండ్లుగా తిరుగుతున్నా భూమిని ఆన్‌లైన్‌లో రికార్డుచేస్తలేరంటూ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని సల్కర్‌పేట గ్రామానికి చెందిన రైతు ధర్మన్న ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ధర్మన్నకు గ్రామంలోని సర్వే నంబర్ 299 ఇలో ఐదు గుంటలు, 299 ఈలో 8 గుంటలు, 312 ఇలో 16 గుంటలు, 352 ఇలో 8 గుంటలు కలిపి మొత్తం 37 గుంటలు భూమి ఉన్నది. రెవెన్యూ అధికారులు ఇందులో కేవలం సర్వే నంబర్ 352 ఇలోని 8 గుంటలను మాత్రమే నమోదుచేసి కొత్త పాస్‌పుస్తకం ఇచ్చారు. కానీ మిగతా సర్వే నంబర్లలోని భూమి 29 గంటలు ఆన్‌లైన్‌లో నమోదుచేయలేదు. ఈ భూమిని ఆన్‌లైన్‌చేయాలంటూ కార్యాల యం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని బాధితు డు ఆరోపిస్తున్నారు. రెండేండ్లుగా తిరుగుతున్నా వీఆర్వో స్పందించడం లేదని ధర్మగంట ఎదుట తన గోడు చెప్పుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో రైతుబంధు సాయం కూడా అందడంలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles