18 ఏండ్లుగా పాస్‌బుక్ ఇస్తలేరు


Sun,August 25, 2019 01:47 AM

farmer kamalamma requests for passbook in mahabubnagar dist

-రెవెన్యూ అధికారులకు రూ.30 వేలు ఇచ్చినం
-మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతుల ఆవేదన

కోయిలకొండ: మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం నల్లవెల్లికి చెందిన కమలమ్మ, సైదయ్య దంపతులు 2001 డిసెంబర్‌లో ఖాజీపూర్‌కు చెందిన చెన్నారెడ్డి, అతని కుమారుడు రాజేందర్‌రెడ్డి వద్ద సర్వే నంబర్ 106లో 3 ఎకరాల భూమిని కొన్నారు. అదే నెల కమలమ్మ పేరిట భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పటిదాకా కమలమ్మకు పాస్‌బుక్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. పాస్‌బుక్ కోసం మేకలు, బంగారం అమ్మి రూ.30 వేలు అధికారులకు ఇచ్చిన్నా పాస్‌పుస్తకం ఇవ్వడంలేదని బాధితురాలు తెలిపారు. తనకు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో రాజేందర్‌రెడ్డి 26 గుం టలను అక్రమంగా ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. పాస్‌బుక్ ఇవ్వకపోవడం తో రైతుబంధు రాలేదని వాపోయారు. జిల్లా అధికారులు స్పదించి పాస్‌బుక్ ఇప్పించాలని బాధితులు వేడుకొంటున్నారు.

246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles