ఓఆర్సీ ఇచ్చినా ఆన్‌లైన్ చేస్తలేరు


Wed,September 11, 2019 02:29 AM

farmer mogulaiah requests to revenue officers over land records

ధర్మగంటను ఆశ్రయించిన మాడ్గుల మండల రైతు
మాడ్గుల: రెవెన్యూ అధికారులు సర్వే నంబర్‌లో కొంతభూమిని మాత్రమే ఆన్‌లైన్‌లో ఎక్కించి.. మిగిలినది ఎక్కించకుండా తిప్పించుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్వే నంబర్ 153 ఇనాం భూమిలోని 6.22 ఎకరాలను వెంకయ్య సాగు చేసుకుంటున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో అధికారులు 5.04 ఎక రాలనే ఆన్‌లైన్లో ఎక్కించి, 1.18 ఎకరాలు ఎక్కించలేదని వెంకయ్య మనువడు కడారి మొగులయ్య చెప్పారు. సర్వే నంబర్ 156లో ఉండాల్సిన రైతులకు అక్రమంగా సర్వే నంబ ర్ 153లో ఎక్కించారని.. దీనిని సరిచేయాలని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదన్నా రు. ఐదునెలల క్రితమే ఇబ్రహీంపట్నం ఆర్డీ వో నుంచి ఓఆర్సీ తీసుకువచ్చినా 1.18 ఎకరాల భూమిని ఆన్‌లైన్లో ఎక్కిస్తలేరని వాపోయారు. భూమి సర్వేకు సిఫారసు చేసినం దున త్వరలోనే సమస్య పరిష్కారమవుతుం దని ఇర్విన్ వీఆర్వో నవీన్ తెలిపారు.

218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles