సార్.. పాస్‌బుక్ ఇవ్వండి

Thu,September 12, 2019 03:07 AM

సూర్యాపేట జిల్లా అన్నారంవాసి షరీఫుద్దీన్ వేడుకోలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏండ్ల కింద కొన్న భూమికి పాస్‌బుక్ ఇవ్వకుండా అధికారులు తిప్పించుకొంటున్నారని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన మహ్మద్ షరీఫుద్దీన్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతుబంధు సైతం అందడంలేదని, తమకు న్యాయంచేయాలని ధర్మగంటను ఆశ్రయించారు. మా తండ్రి పేరు మహ్మద్ గోరెసాబు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 482/ఇలో మా తండ్రి పేరిట 2.06 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో కొంత భూమిని 1961లో, మరికొంత భూమిని 1963లో షేక్ మదార్ సాబు, చాంద్ పాషా వద్ద కొన్నారు. అనంతరం అడంగల్ పహాణీలో మా తండ్రి పేరు నమోదుచేశారు. తర్వాత కొన్నేండ్లకు ఆ భూమిని నా పేరిట మార్చుకొన్నాను. అధికారులు మాత్రం అనుభవదారు కాలమ్‌లో మాత్రమే నా పేరు నమోదుచేసి, పట్టాదారు కాలమ్‌లో మాకు భూమి విక్రయించిన వారి పేరు కొనసాగిస్తున్నారు.


భూమిని మేమే సాగుచేసుకొంటున్నాం. ఈ సమస్యపై ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారులు రేపు మాపు అంటూ తిప్పుకొంటున్నారు. రెవెన్యూ అధికారులు కొత్త పాస్‌పుస్తకం మంజూరుచేయకపోవడతో రెండువిడుతల రైతుబంధు సాయా న్ని కోల్పోయాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొత్త పాస్‌పుస్తకం ఇప్పించి న్యాయంచేయాలి అని షరీఫుద్దీన్ కోరుతున్నారు. విషయమై వీఆర్వో గోపీని వివర ణ కోరగా.. తానే ఇక్కడికి రెండు నెలల కిందే వచ్చానని, పాత రికార్డులను పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.

479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles