మూడేండ్లుగా ముప్పుతిప్పలు


Sun,August 25, 2019 02:42 AM

farmer sangoju jagataiah meets dharmaganta over virasat

నాగర్‌కర్నూల్ జిల్లా బాధితుడు జగతయ్య ఆవేదన
ఊర్కొండ: నా పేరు సంగోజు జగతయ్య. మా తండ్రి పేరు నారాయణ. మాది నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాంరెడ్డిపల్లి గ్రామం. మా అమ్మ పేరిట రాంరెడ్డిపల్లిలోని సర్వే నంబర్ 240లో 37 గుంటల భూమి ఉన్నది. మా అమ్మ 2005 లో చనిపోయారు. ఆమె తదనంతరం ఆ 37 గుంట ల పొలాన్ని నా పేరిట విరాసత్ ద్వారా మార్చుకోవడానికి ఊర్కొండ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాను. నన్ను ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకొన్న పాపాన పోలేదు. తాసిల్ కార్యాలయంలో ఆర్‌ఐ, వీఆర్వోకు ఇప్పటికే వందలసార్లు నా సమస్యను విన్నవించుకొన్నాను. మా అమ్మ పేరిట ఉన్న పొలాన్ని నా పేరిట మార్చుకొని వ్యవసాయం చేసుకొందామనుకొంటే.. అది కలగానే మిగిలిపోయింది. తాసిల్ కార్యాలయంలో పైసలున్న వాళ్లకే పనులవుతున్నాయి. నాలాంటి రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు పనులు జరుగడం లేదు. చివరకు ప్రజావాణిలో జిల్లా జాయిం ట్ కలెక్టర్‌కు నా సమస్యపై వినతిపత్రం అందిచినా ఫలితంలేదు. ధర్మగంట ద్వారా నా సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి నాకు న్యాయంచేయాలి.

ఇటీవలే బాధ్యతలు తీసుకున్నా

రాంరెడ్డిపల్లికి చెందిన వడ్ల రాములమ్మ భూమి 37 గుంటలను ఆమె కుమారుడు జగతయ్య పేరిట నమోదుచేయాలని నా దృష్టికి ఎవరూ తీసుకురాలేదు. సిబ్బంది దృష్టికి వచ్చినా వారి నిర్లక్ష్యం వల్ల నాకు తెలియలేదు. తక్షణమే బాధితుడికి తల్లి పేరిట ఉన్న పొలాన్ని పరిశీలించి ఆయన పేరిట మార్పుచేస్తాం.
- శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దార్, ఊర్కొండ

369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles