రావాల్సింది ఎక్కించి.. ఉన్నది తీసేశారు


Sun,August 25, 2019 02:19 AM

farmer singireddy narasimha reddy meets dharmaganta over revenue officers negligence

-కోర్టు చెప్పిందొకటి.. రెవెన్యూ అధికారులు చేసిందొకటి
-కబ్జాదారులకు వత్తాసు
-ధర్మగంటను ఆశ్రయించిన కరీంనగర్ జిల్లా బాధిత రైతు సింగిరెడ్డి నర్సింహారెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మరొకరి రికార్డుల్లో నమోదైన భూమిని అసలు పట్టాదారుడి రికార్డుల్లో నమోదుచేయాలని కోర్టు ఆదేశాలను తుచ తప్పకుండా పాటించిన రెవెన్యూ అధికారులు.. అతడి పేరిట అప్పటికే ఉన్నభూమిని తొలగించి తీర్పుకు వక్రభాష్యం చెప్పారు. రికార్డులను తారుమారు చేసి కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం తాసిల్ అధికారుల తీరుతో 26 గుంటల భూమిని కోల్పోయానంటూ మండలంలోని మాదాపూర్‌కు చెంది న సింగిరెడ్డి నర్సింహారెడ్డి ధర్మగంటను ఆశ్రయించారు. నర్సింహారెడ్డి మాదాపూర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 423లో 1.24 ఎకరాలను 1970 మే 15న అన్నాడి మల్లమ్మ వద్ద సాదాబైనామా ద్వారా కొన్నారు. అప్పటినుంచి సాగు చేసుకొంటున్నారు. ఈ భూమిని 1992 ఫిబ్రవరి 5న అప్పటి తాసిల్దార్ ప్రొసీడింగ్ నంబర్ బీ/766/89 ద్వారా క్రమబద్ధీకరణచేశారు. 13-బీ జారీచేయడంతో, అన్ని రికార్డుల్లోనూ సింగిరెడ్డి పేరును నమోదుచేశారు. తర్వా త స్థానిక రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారుచేశారు.

సింగిరెడ్డి నర్సింహారెడ్డికి చెందిన 1.24 ఎకరాల్లో నుంచి 38 గుంటలను నోము ల నర్సింహారెడ్డి పేరిట రికార్డుల్లో ఎక్కించారు. సింగిరెడ్డి రికార్డుల్లో 26 గుంటలు మాత్రమే ఉంచారు. రికార్డుల్లో తన పేరిట భూమి ఎక్కడాన్ని అవకాశంగా తీసుకొన్న నోముల నర్సింహారెడ్డి 38 గుంటలను కబ్జాచేశాడు. రికార్డుల్లో నుంచి తొలగించిన భూమిని తన పేరిట ఎక్కించాలంటూ సింగిరెడ్డి అధికారులకు ఎన్నిసార్లు వేడుకొన్నా కనికరించలేదు. బాధితుడు ఆర్డీవోను ఆశ్రయించారు. ఆ భూమి సింగిరెడ్డికి చెందినదేనని తేల్చిన ఆర్డీవో.. దానిని సాగుచేసుకొనేందుకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే పోలీస్ రక్షణ తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆర్డీవో ఉత్తర్వులను గన్నేరువరం తాసిల్ అధికారులు అమలుచేయలేదు. ఆ భూమి తనదేనంటూ నోముల నర్సింహారెడ్డి హుస్నాబాద్ సివిల్‌కోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు అది సింగిరెడ్డికే చెందుతుందని స్పష్టంచేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు 38 గుంటల భూమిని సింగిరెడ్డి పేరిట రికార్డుల్లో ఎక్కించారు. కానీ, అప్పటికే అతడి పేరిట రికార్డుల్లో ఉన్న 26 గుంటల భూమిని తొలగించి.. నోముల నర్సింహారెడ్డి కుటుంబసభ్యుల రికార్డుల్లోకి ఎక్కించారు. దీంతో 26 గుంటల భూమి తిరిగి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. స్థానిక రెవెన్యూ అధికారులు కావాలనే కబ్జాదారులకు వంతపాడుతున్నారంటూ సింగిరెడ్డి తన భూమి కోసం పోరాతున్నారు.

సరిచేసి ఇస్తాం

సాంకేతిక కారణాలతోనే సింగిరెడ్డి నర్సింహారెడ్డి పేరిట ఉన్న 26 గుంటలు మరొకరి రికార్డుల్లోకి ఎక్కి ఉండవచ్చు. రికార్డులు పరిశీలించి సరి చేస్తాం.
- ప్రభాకర్, గన్నేరువరం తాసిల్దార్

289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles