నీరాపై అధ్యయనానికి విదేశీ పర్యటన

Tue,September 17, 2019 02:46 AM

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రంలోని అన్ని కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. త్వరలోనే నీరా ఉత్పత్తిపై అధ్యయనానికి నిపుణుల కమిటీ కేరళ, మహారాష్ట్రతోపాటు శ్రీలంక, కాంబోడియా దేశాలకు వెళ్లనున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో గుడుంబా నిషేధంతో నష్టపోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు అంజయ్య, క్రాంతికిరణ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.


koppula

ఓవర్సీస్ విద్యానిధి కింద 459 మందికి లబ్ధి: మంత్రి కొప్పుల

రాష్ట్రం ఏర్పాటైననాటి నుంచి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 459 మంది విద్యార్థులు లబ్ధి పొందారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పథకానికి ఇప్పటివరకు రూ.72 కోట్ల 51 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గాదరి కిశోర్, హరిప్రియ బానోత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని బాల్కసుమన్ కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

malla-reddy

సామాజిక భద్రత కింద రూ.ఐదు లక్షల బీమా: మంత్రి మల్లారెడ్డి

రవాణా, రవాణేతర ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు సామాజిక భద్రత పథకం కింద రూ.ఐదు లక్షల ప్రమాదబీమా కల్పిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దుర్గం చిన్నయ్య, నరేందర్ నన్నపనేని అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

g-kamalakar

సన్నబియ్యానికి రూ.306కోట్ల ఖర్చు: మంత్రి గంగుల

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యం కోసం ఈ నెల ఏడోతేదీ వరకు రూ.306.62 కోట్లు ఖర్చు చేసినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బొల్లం మల్లయ్యయాదవ్, బానోత్ శంకర్‌నాయక్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బీసీలకు స్కాలర్‌షిప్స్ కోసం రూ.1569.13 కోట్లు, బీసీ గురుకులాలకు రూ.381 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.

satyavathi-rathod-assembly

మహిళలకు అధిక ప్రాధాన్యం: మంత్రి సత్యవతి

మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని, వీ హబ్ పేరిట పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారని గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఏండ్ల తరబడి గిరిజనులకు పాలకులు హామీలే ఇచ్చారని, సీఎం కేసీఆర్ మాత్రం అన్ని తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనుల స్వయంపాలనకు అవకాశం కల్పించారని చెప్పారు.

715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles