అడవికి హద్దురాళ్లు


Wed,September 11, 2019 02:51 AM

Forest Department officers Surveys in Chandampet

-చందంపేటలో ముమ్మరంగా అటవీశాఖ సర్వే
-కంబాలపల్లి, పొగిళ్ల పరిధిలో భూలెక్కలు తీస్తున్న రెవెన్యూ అధికారులు
-అడవిని అమ్మేశారుపై విచారణ కొనసాగుతున్నది: తాసిల్దార్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి, పొగిళ్ల గ్రామాల పరిధుల్లో విస్తరించిన నల్లమల అటవీప్రాంతాన్ని రక్షించేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది. ఇటీవల నమస్తే తెలంగాణలో అడవిని అమ్మేశారు శీర్షికన కథనం ప్రచురించిన నేప థ్యంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సర్వే నిర్వహించి అటవీభూము లు ఎంతమేరకు ఉన్నాయనే దానిపై నిర్ధా రణకు వచ్చారు. తాజాగా అటవీభూముల హద్దుల వరకు రాళ్లు పాతుతున్నారు. పొగి ళ్ల, కంబాలపల్లి పరిధుల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

dharmaganta1

కీలకంగా మారనున్న రెవెన్యూ ప్రక్షాళన

అటవీశాఖ అధికారులు తమ భూములకు హద్దురాళ్లు పాతుతుండగా.. మరోవైపు ఈ రెండు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు భూరికార్డుల ప్రక్షాళన కొనసాగిస్తున్నారు. ముగ్గురు ఆర్‌ఐలను ప్రత్యేకంగా ఈ భూముల విచారణకు నియమించారు. మరో ముగ్గురు అధికారులను కూడా నియమించనున్నట్టు రెవెన్యూ అధికారు లు తెలిపారు. ఇప్పటిదాకా కంబాలపల్లి పరిధిలోని రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది. పొగిళ్ల పరిధిలోని మాన్యువల్ రికార్డుల ప్రకారం ఉన్న భూమి ఎంత? ఎవరెవరి పేరుమీద ఎంత ఉన్నది? అదనంగా జారీచేసిన పాస్‌పుస్తకాల వ్యవహా రం వెనుక కథేంటి? అనేది తేల్చనున్నా రు. మూడువేల ఎకరాలకుపైగా భూముల వ్యవహారాన్ని తేల్చే అంశమైనందున ఇందుకు సమయం పడుతుందని చందంపేట తాసిల్దార్ తెలిపారు. ఈ వ్యవహారంలో అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల హస్తం ఉన్నట్టు సమాచారం ఉన్నదని, దీనిపై జాయింట్ కలెక్టర్‌కు సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు.

339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles