39 వేల జరిమానా


Wed,August 14, 2019 01:23 AM

Forest department to fine cut trees

- హైదరాబాద్‌లో మూడుచెట్లు నరికినందుకు అటవీశాఖ కొరడా
బంజారాహిల్స్: అనుమతి లేకుండా చెట్లను నరికిన ఒక వాణిజ్య భవన యజమానులకు అటవీశాఖ భారీ జరిమానా విధించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కాంప్లెక్స్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్న మూడు భారీ చెట్లను యజమానులు నరికేసిన విషయాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బంజారాహిల్స్ డిప్యుటీ రేంజ్ అధికారి మహేశ్ విచారించి అనుమతి పొందకుండానే చెట్లు నరికినట్టు గుర్తించారు. దీన్ని నేరంగా పరిగణించిన అటవీ అధికారులు భవన నిర్మాణదారులైన శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులకు రూ.39 వేల జరిమానా విధించారు. ఈ జరిమానా మొత్తాన్ని చలానా రూపంలో వసూలు చేశారు.

811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles