గాలింపు ముమ్మరం

Tue,September 17, 2019 03:13 AM

-పన్నెండుకు చేరిన మృతుల సంఖ్య
-గోదావరి లాంచీ ప్రమాదంలో మరో నాలుగు మృతదేహాలు లభ్యం
-315 అడుగుల లోతులో బోటును గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్
-ప్రమాదస్థలాన్ని ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలించిన ఏపీ సీఎం జగన్
-దవాఖానలో బాధితులకు పరామర్శ.. కుటుంబాలకు ఓదార్పు
-సహాయకచర్యలను పర్యవేక్షించిన తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ, ఎమ్మెల్యే ఆరూరి

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో లాంచీ మునిగిన ప్రమాదంలో మృతిచెందినవారి సంఖ్య పన్నెండుకు చేరింది. గల్లంతయిన 39 మందిలో సోమవారం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో నెలల వయసున్న పసిపాప మృతదేహం లభించడం విషాదం. గల్లంతయిన వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. లాంచీ ప్రమాదం జరిగిన కచులూరు ప్రాంతాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఏరియల్ సర్వేద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని దవాఖానలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు సహాయకచర్యల్లో భాగం పంచుకునేందుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వెళ్లారు. వారు ఏపీ సీఎంతో కలిసి రాజమహేంద్రవరం దవాఖానలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

cm-ys-jagan
హైదరాబాద్/ సిటీబ్యూరో/ వరంగల్ ప్రధాన ప్రతినిధి/ఖమ్మం ప్రధాన ప్రతినిధి/ హాలియా, నమస్తే తెలంగాణ: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ఆదివారం లాంచీ మునకప్రమాదంలో గల్లంతయిన వారికోసం గాలింపు ము మ్మరంగా కొనసాగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు సహాయకచర్యల్లో భాగం పంచుకునేందుకు తెలంగాణమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రా వు, పువ్వాడ అజయ్‌కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజమహేంద్రవరం వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఏరియల్ సర్వేద్వారా పరిశీలించారు. అనంత రం దవాఖానలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. లాంచీలో ఉన్న మొత్తం 73 మందిలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మృతదేహాలను ఆదివారం వెలికితీసిన విషయం తెలిసిందే.

సోమవారం నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వా రిలో నెలల వయసున్న పసిపాప మృతదేహం లభించడం విషాదం. ప్రమాదానికి గురైన లాంచీ గోదావరిలో 315 అడుగుల లోతులో ఉన్నట్టు ఎన్డీఆర్‌ఎఫ్ గుర్తించింది. నదిపై తేలియాడుతున్న ఆయిల్ మరకల ఆధారంగా లాంచీని గుర్తించినట్టు సిబ్బంది తెలిపారు. కాగా, నదిలో ప్రవాహ ఉధృతి, వర్షం కురుస్తున్న కారణంగా సహాయకచర్యలకు అంతరాయం కలుగుతున్నది. ఎనిమిది ఈఆర్ బృందాలు, 12 గజ ఈతగాళ్ల బృందాలు, ఆరు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, రెండు ఎస్డీఆర్‌ఎఫ్ బృదాలు, నేవీచాప్టర్, ఓఎన్జీజీసీ చాప్టర్ ప్రత్యే క బృందాలు గాలింపులో పాల్గొంటున్నాయి.

ndrf

సహాయక చర్యల్లో తెలంగాణ మంత్రులు

గోదావరి లాంచీ ప్రమాద బాధితులకు ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ దవాఖానలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. గల్లంతయిన వారికోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి సహాయకచర్యలు చేపడుతున్నట్టు వారు తెలిపారు. సోమవారం రోజం తా అక్కడే ఉండి సహాయకచర్యలను పర్యవేక్షించారు. తెలంగాణకు చెందిన బస్కె రాజేందర్, బస్కె అవినాశ్, శివజ్యోతి మృతదేహాలకు అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి వరంగల్, హైదరాబాద్‌కు తరలించారు.

బాధిత కుటుంబాలకు నేతల పరామర్శ

గోదావరి లాంచీ ప్రమాదంలో గల్లంతయిన హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన సాయికుమార్ ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నా రు. సాయికుమార్‌తో వెళ్లిన స్నేహితుల్లో హయత్‌నగర్‌కు చెందిన విశాల్, భరణి సురక్షితంగా బయటపడినా.. అర్జున్, ధరణి ఆచూకీ తెలియలేదు. బాధితకుటుంబసభ్యులను ఎ మ్మెల్యే సుధీర్‌రెడ్డి పరామర్శించారు. రామంతాపూర్‌కు చెందిన అంకెల శంకర్, రేవతి కుటుంబాలను ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి పరామర్శించారు. చంపాపేటకు చెందిన రాజేశ్.. తాను క్షేమంగా ఉన్నట్టు తల్లిదండ్రులతో ఫోన్‌లో చెప్పడంతో వారు ఊరటచెందారు. అతనితో వెళ్లిన రాజేశ్, శివశంకర్, కిరణ్ క్షేమంగా ఉన్నట్టు సమాచారం ఉండగా మరో ముగ్గురు హేమంత్, తరుణ్, రవీందర్ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉన్నది.

ndrf2

లభించని యువ ఇంజినీర్ల ఆచూకీ

లాంచీ ప్రమాదంలో గల్లంతైన యువ ఇంజినీర్లు నల్లగొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్, అనుముల మండ లం రామడుగుకు పాశం తరుణ్‌రెడ్డి ఆచూకీ సోమవారం సాయంత్రం వరకు కూడా లభించలేదు. పడవ ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు ఆదివారమే దేవీపట్నానికి వెళ్లారు. హాలియాకు చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ దంపతుల పెద్దకుమారుడు సురభి రవీందర్. రామడుగుకు చెందిన కృష్ణారెడ్డి, పద్మ రెండోకుమారుడు తరుణ్‌రెడ్డి.

ప్రమాదంపై కోలేటి దిగ్భ్రాంతి

లాంచీ ప్రమాదంలో తమసంస్థలో పనిచేసేవా రు మృతిచెందడంపై పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా దిగ్భ్రాంతికి గురయ్యారు. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దుఃఖసాగరంలో కడిపికొండ

గోదావరిలో గల్లంతయినవారి అచూకీ లభించక వరంగల్ జిల్లా కడిపికొండలోని బాధిత కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. ఉన్నరో లేరో తెల్వదు.. వత్తరో రారో తెల్వదు. పోకపోయినా మంచిగుండు. మేం బతికేం లాభం. మా వాడను చీకటి చేసిండ్లు.. అంటూ కాలనీలో అందరూ ఏడుస్తూనే ఉన్నారు. మరణించిన వాళ్ల శవాలన్నా దొరికాయి. గోదాట్లో తప్పిపోయినోళ్లు ఏడ చిక్కుకున్నరో. సుడిగుండల మన్నువడ. మమ్ముల ఆగం చేసిందీ అంటూ కడిపికొండలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ndrf3

1964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles