బంగారు తెలంగాణ సాధిద్దాం


Wed,September 11, 2019 02:59 AM

Governor Dr Tamilisai Soundararajan offers prayers to Khairatabad Ganesh

-ప్రపంచ ప్రసిద్ధ గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉన్నది
-ఖైరతాబాద్ ద్వాదశాదిత్యుడికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

ఖైరతాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసి పనిచేద్దామంటూ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పిలుపునిచ్చారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలిసారిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని మంగళవారం దర్శించుకొన్నారు. గవర్నర్‌కు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కార్యనిర్వహక కార్యదర్శి సింగరి రాజ్‌కుమార్, అర్చకులు మహదేవ్, రంగరాజాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి, సత్కరించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ గవర్నర్‌కు ఖైరతాబాద్ మహాగణపతి చరిత్ర, విశేషాలను వివరించి చెప్పారు. అనంతరం గవర్నర్ తమిళిసై మహాగణపతి సమక్షంలో తెలుగులో మాట్లాడారు. తెలంగాణకు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడం అదృష్టమన్నారు. గణనాథుడు తెలంగాణ ప్రజలకు శుభాలు కలుగజేయాలని ఆకాంక్షించారు.

గవర్నర్ ఓనమ్ శుభాకాంక్షలు

తెలంగాణలో నివసించే కేరళ వాసులకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సుఖశాంతుల్ని అందించాలని, సోదరభావాన్ని పెంపొందించాలని అభిలషించారు. ఓనమ్ జాతీయ సమైక్యతకు ప్రతీక అని చెప్పారు.

250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles