అమల్లోకి వచ్చిన కొత్త మున్సిపల్ చట్టం

Thu,October 10, 2019 02:23 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టం- 2019కి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదముద్ర వేశారు. ఈ చట్టానికి ఇటీవల శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపిన విషయం విదితమే. కొత్త మున్సిపల్ చట్టాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గవర్నర్‌కు సమర్పించింది. గవర్నర్ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు, ఉర్దూ, ఆంగ్లంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు బుధవారం అధికారవర్గాలు వెల్లడించాయి. దీనితో కొత్త చట్టం అమల్లోకి వచ్చినట్టయింది.

96
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles