ప్రైవేట్ పొమ్మంది.. సర్కార్ రమ్మంది


Wed,September 11, 2019 02:21 AM

govt doctor saves pregnant women life in huzurabad

-చావు బతుకుల్లో ఏడు నెలల గర్భిణి
-అత్యంత క్లిష్ట శస్త్రచికిత్స చేసి బతికించిన ప్రభుత్వ వైద్యుడు
హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: చావుబతుకుల్లో ఉన్న ఏడు నెలల గర్భిణిని ఓ ప్రభుత్వ వైద్యుడు కాపాడి మరోసారి ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంచారు. బాధితురాలు తెలిపిన ప్రకారం.. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లికి చెందిన ఓ వివాహిత.. కరీంనగర్‌లోని ఓ దవాఖానలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. దీని కోసం సదరు ప్రైవేట్ దవాఖాన నిర్వాహకులు ఆమె వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు. కాగా సోమవారం ఉదయం గర్భిణికి కడుపునొప్పి రావడంతో భర్తతో కలిసి కరీంనగర్‌లోని సదరు ప్రైవేట్ వైద్యురాలి వద్దకు వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు కడుపులో పాప మృతిచెందినట్టు చెప్పారు. తక్షణమే ఆపరేషన్ చేస్తేనే తల్లి బతుకుతుందని చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దంపతులు హుజూరాబాద్ ప్రభుత్వదవాఖానకు వెళ్లారు. వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆమెకు ఆపరేషన్ చేసి మృతిచెందిన పాపను తొలగించి ఆమెను ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నది.

354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles