ఆర్టీసీ కార్మికులు పట్టుదలకు పోవొద్దు

Fri,November 8, 2019 01:51 AM

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
కోదాడ, నమస్తేతెలంగాణ: ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పట్టుదలకు పోకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్‌రెడ్డి సూచించారు. ఏ ప్ర భుత్వమైనా ప్రభుత్వ రంగసంస్థలను కాపాడుకోవాలనే చూ స్తుందని చెప్పారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడకు వచ్చిన ఆయనకు ఆర్టీసీ కార్మికులు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ విశ్రాంతి గృహంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. చర్చల ద్వారానే కార్మికుల సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రభుత్వంతో జరిగే చర్చల్లో విలీనం తప్ప.. ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో.. కార్మికులపైనా అంతే ఉన్నదని సూచించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు పాల్గొన్నారు.

840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles