అమెరికాలో హైదరాబాద్ మహిళ ఆత్మహత్య!

Tue,October 8, 2019 03:11 AM

భర్త వేధింపులే కారణమని పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు
మన్సూరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళ అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. భర్త వేధింపుల కారణంగానే చనిపోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని నగరానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని, అలాగే తన కూతురు మృతికి కారకుడైన అల్లుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మృతురాలి తండ్రి కథనం ప్రకారం.. ఎల్బీనగర్‌లో నివసించే గజం కృష్ణయ్య, పారిజాత దంపతుల రెండో కుమార్తె వనిత (30) వివాహం కొత్తపేటకు చెందిన రాచకొండ లక్ష్మీనారాయణ రెండో కుమారుడు శివకుమార్‌తో 15 ఏండ్ల క్రితం జరిగింది. వీరికి కూతురు సింధూ (13), కుమారుడు సిద్ధు (10) ఉన్నారు. శివకుమార్ భార్య, పిల్లలతో కలిసి అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నాడు. ఆరేండ్లుగా భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం ఇండియాలో ఉండిపోదాంఅని భార్య, పిల్లలతో హైదరాబాద్ వచ్చిన శివకుమార్.. పిల్లలను తన తల్లిదండ్రుల వద్ద ఉంచాడు.


g-vanitha2
ఉద్యోగం సెటిల్ చేసుకొని వస్తానంటూ ఎల్బీనగర్‌లో భార్యను వదిలి అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత 15 రోజులకు వచ్చి ఇద్దరు పిల్లలను అమెరికాకు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి భార్యకు ఫోన్ చేయడంగానీ, ఆమెను అమెరికాకు తీసుకెళ్లే ప్రయత్నంగానీ జరుగలేదు. దాంతో గజం కృష్ణయ్య విషయాన్ని కులపెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడిన అనంతరం నాలుగునెలల క్రితం భార్యకు వీసా పంపాడు. పెద్దలు నచ్చజెప్పడంతో వనిత అమెరికా వెళ్లింది. తిరిగి వేధింపులకు గురిచేస్తున్నాడని వనిత తన తల్లిదండ్రులకు తెలిపింది. నరకం చూపిస్తున్నాడని, ఇక్కడ ఉండలేనంటూ రోదిస్తూ తల్లిదండ్రులకు చెప్పింది. ఈ నెల 4న సాయంత్రం భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం అల్లుడి బంధువుల నుంచి సమాచారం అందడంతో.. కూతురు మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ గజం కృష్ణయ్య ఆదివారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles